Boyapati Srinu Ram Pothineni Combo: ఇస్మార్ట్ హీరో రామ్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమాను చేస్తున్నాడు. వినయ విధేయ రామ తరువాత అఖండ అంటూ తన పవర్ ఏంటో చూపించాడు బోయపాటి శ్రీను. అఖండ అద్భుతమైన విజయాన్ని చవిచూసింది. దీంతో బోయపాటి మార్కెట్ మరోసారి పెరిగింది. దీంతో రామ్ పోతినేనితో బోయపాటి ఓ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. రెడ్ సినిమాతో రామ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు రామ్‌కు ఓ హిట్ కావాలి. బోయపాటి అఖండతో మంచి ఫాంలోకి వచ్చాడు. దీంతో ఈ ఇద్దరూ చేయబోతోన్న సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మధ్యే వదిలిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి స్టైల్లోనే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఇక రామ్ అయితే కొత్త అవతారంలో కనిపించాడు. ఈ సినిమా కోసం రామ్ తన హెయిర్‌, బాడీని పెంచేశాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.


బోయపాటి సినిమా అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పదులు, వందల మందిని హీరో నరకాల్సిందే. క్లైమాక్స్‌ను చాలా హెవీగా ప్లాన్ చేస్తుంటాడు. అయితే బోయపాటి ఇప్పుడు కూడా తన స్టైల్లోనే క్లైమాక్స్ షూట్ చేసినట్టుగా ఉన్నాడు. గత ఇరవై నాలుగు రోజులుగా క్లైమాక్స్‌ను షూట్ చేస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని హీరో రామ్ ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్‌లోనే ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో చెప్పేశాడు.


Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!


ఫైనల్‌గా క్లైమాక్స్‌ను పూర్తి చేశాం.. 24 రోజుల పాటుగా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూనే ఉన్నాం.. ఇది క్లైమాక్స్ కాదు.. అంతకు మించి అనేలా ట్వీట్ వేశాడు. మొత్తానికి రామ్ చేత ఎంద మందిని నరికిస్తాడో అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇదే ఏడాది థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ చిత్రం తరువాత రామ్.. మళ్లీ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమాను చేయనున్నాడు.


Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook