The Warriorr Pre Release Business: రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన రెడ్ అనే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తాజాగా రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో  ది వారియర్ సినిమా చేశాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మరి కొద్ది రోజులలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేకర్స్.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ది వారియర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించగా తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో, తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించారు. ఈ సినిమా జూలై 15వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ది వారియర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది అనే విషయం తాజాగా ట్రేడ్ వర్గాల వారి ద్వారా వెల్లడైంది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో 11 కోట్ల రూపాయలకు హక్కులు అమ్ముడుపోయాయని తెలిసింది. అలాగే సీడెడ్ ప్రాంతంలో 6 కోట్ల రూపాయలకు సినిమా హక్కులు అమ్ముడు అయ్యాయి.


మిగిలిన ఆంధ్ర ప్రాంతం అంతా కలిపి 17 కోట్ల రూపాయలకి సినిమా హక్కులు అమ్ముడు అయ్యాయని ట్రేడ్ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే 34 కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడయ్యాయి. అయితే కర్ణాటక సహా మిగిలిన భారతదేశం మొత్తం రెండు కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడయ్యాయి. అలాగే ఓవర్సీస్ లో రెండు కోట్ల పది లక్షల రూపాయల మేర ది వారియర్ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి. ఇక కేవలం తమిళ వర్షన్ కు మాత్రం ఐదు కోట్ల రూపాయల మేర హక్కులు అమ్ముడయినట్లు వెల్లడైంది.


ఈ లెక్కను చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 43 కోట్ల పది లక్షల రూపాయల మేర బిజినెస్ చేసింది అంటే బ్రేక్ ఈవెన్ 44 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తోంది. అలాగే రామ్ తన కెరియర్‌ లోనే మొట్ట మొదటిసారిగా ఈ సినిమా కోసం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. 


Also Read: Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనిపించేలా!


Also Read: Shaking Seshu: కిరాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్.. 20 లక్షలు టోపీ.. హోం టూర్ ఇల్లు కూడా మోసమే.. సంచలన విషయాలు బయటపెట్టిన షేకింగ్ శేషు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook