Ramarao on Duty Twitter Review: మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కి పండగే అని చెప్పాలి. శరత్ మండవా దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నాడు. ఖిలాడీ లాంటి డిజాస్టర్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది. గతేడాది 'క్రాక్‌'తో బ్లాక్‌బ్లస్టర్ అందుకున్న రవితేజ ఖాతాలో 'రామారావు ఆన్ డ్యూటీ'తో మరో బ్లాక్ బ్లస్టర్ పడినట్లేనా.. సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఇది పూర్తిగా మాస్ అండ్ పొలిటికల్ లీడర్స్ మూవీ. సినిమాలో బీజీఎం అద్భుతంగా ఉంది. సినిమాకు నా రేటింగ్ 3.5/5' అని ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో తన రివ్యూ ఇచ్చాడు.



'ఇదొక ఎబౌ యావరేజ్ థ్రిల్లర్ డ్రామా. ఎప్పటిలాగే రవితేజ చించేశాడు. సినిమాలో క్యాస్టింగ్ బాగుంది. మ్యూజిక్ ఓకె. బీజీఎం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. స్టోరీ డీసెంట్‌గా ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదు.'  అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో తన రివ్యూ షేర్ చేశాడు.



'రామారావు ఆన్ డ్యూటీ చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. ఆద్యంతం ఎంజాయ్ చేశాను. రవితేజకు, డైరెక్టర్ శరత్‌కు కంగ్రాచులేషన్స్..' అంటూ మరో నెటిజన్ సినిమాపై తన ఒపీనియన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.



'ఇప్పుడే సినిమా చూశాను. మాస్ మహారాజ్ నుంచి మరో బ్లాక్ బ్లస్టర్. ఇంటర్వెల్, సినిమా ఫైర్‌లా ఉంది.' అంటూ మరో నెటిజన్ ట్విట్టర్‌లో తన రివ్యూ ఇచ్చాడు.



'సినిమా ఫస్టాఫ్‌కు బ్లాక్‌ బ్లస్టర్ టాక్ వచ్చేసింది. రవితేజ అన్నా కొట్టేస్తున్నాం..' అంటూ మరో నెటిజన్ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు.


రవితేజ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందించగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించారు. రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. 


Also Read: Horoscope Today July 29th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి దూరమైన బంధుమిత్రులు మళ్లీ దగ్గరవుతారు..


Also Read: Vedhika Hot Pics: వేదిక అందాల వేడుక.. సముద్రంలో సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook