Rangasthalam in Japan: జపాన్‌లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్న రంగస్థలం, చెర్రీ క్రేజ్ మామాలుగా లేదుగా
Rangasthalam in Japan: గోదావరి గ్రామీణ వాతావరణం నేపధ్యంలో తెరకెక్కి మెగా హిట్‌గా నిలిచిన రంగస్థలం మరోసారి విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి సంచలనం సృష్టిస్నది ఇండియాలో కాదు ఏకంగా జపాన్ దేశంలో. పూర్తి వివరాలు మీ కోసం..
Rangasthalam in Japan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఐదేళ్ల క్రితం ఓ బ్లాక్ బస్టర్ మూవీ. ఇండియన్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా నిన్న జపాన్‌లో విడుదలై సంచలనం రేపింది. విదేశంలో కూడా దుమ్మురేపుతోంది. భారీ అడ్వాన్స్ బుకింగ్ కూడా జరగడం విశేషం.
ఐదేళ్ల క్రితం విడుదలైన తెలుగు చలనచిత్రం రంగస్థలం రామ్ చరణ్ కెరీర్‌లో అద్భుతం. రికార్డు కలెక్షన్లతో హోరెత్తించింది. రామ్‌చరణ్‌లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటించింది. గోదావరి గ్రామీణ వాతావరణం, 80 దశకంలో గ్రామ రాజకీయాల నేపధ్యంలో సినిమా తెరకెక్కింది. గ్రామాభివృద్ధికై శ్రమించే అన్నకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని ప్రతీకారం తీర్చుకోవడంలో చెవిటివాడిగా రామ్‌చరణ్ నటన నిజంగా అద్భుతం. దాదాపు ఐదేళ్ల తరువాత ఈ సినిమాను ఇప్పుడు జపాన్‌లో విడుదల చేశారు.
నిన్న అంటే శుక్రవారం నాడు జపాన్‌వ్యాప్తంగా 70 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. స్పేస్‌బాక్స్ అనే సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయగా తొలిరోజే భారీ కలెక్షన్లు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం రేపిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్ జపాన్ దేశంలో విశేషమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు రంగస్థలం విడుదల కావడంతో సహజంగానే రామ్‌చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. చెర్రీ సినిమాకు అభిమానులు పోటెత్తారు. భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి.
రంగస్థలం సినిమాకు నిన్న మొదటిరోజే 2.5 మిలియన్ యెన్స్ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. అంటే ఇండియన్ కరెన్సీలో 15 లక్షల రూపాయలు. ఇవాళ , రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరగవచ్చని అంచనా. గత కొద్దికాలంగో స్పేస్‌బాక్స్ సంస్థ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్ని జపాన్‌లో విడుదల చేస్తోంది. ఇంతకుముందు భజరంగీ భాయ్‌జాన్, అంధాధున్, సూపర్ 30, వారిసు, వాల్తేరు వీరయ్య చిత్రాల్ని ఈ సంస్థే విడుదల చేసింది.
Also read: Baby 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న 'బేబీ'.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook