Vyuham Movie Teaser: ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవిత నేపధ్యంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. గతంలో పోస్టర్‌తో సినిమా ఆసక్తి రేపిన రామ్‌గోపాల్ వర్మ..టీజర్‌తో ఏం చేయనున్నాడనేది చర్చనీయాంశమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉండి కేవలం సోషల్ మీడియాకే పరిమితమై అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో ఎక్కుతున్న ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు మరో రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఒకటి వ్యూహం కాగా రెండవది శపథం. ఈ రెండింటిలో వ్యూహం సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. కారణం ఈ సినిమా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవిత నేపధ్యంలో సాగుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. వ్యూహం పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 


ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. త్వరలో వ్యూహం సినిమా టీజర్ విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యూహం సినిమా టీజర్ విడుదల కానుందని ఆర్జీవీ స్వయంగా ప్రకటించాడు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను అజ్మల్ అమీర్ పోషిస్తుంటే..వైఎస్ భారతి పాత్రను మానస రాధా కృష్ణన్ పోషించనుంది. మొదటి భాగం వ్యూహం కాగా రెండవ భాగం శపథం. అయితే ఇవి బయోపిక్స్ కాదని రియల్ పిక్స్ అని రామ్‌గోపాల్ వర్మ కోట్ చేయడం విశేషం. 


Also read: Adipurush 6th Day Collections: ఆదిపురుష్ 6వ రోజు కలెక్షన్స్.. అంతంత మాత్రంగానే!


ఇటీవలే రెండ్రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో దాదాపు గంట సేపు సమావేశమైన రామ్‌గోపాల్ వర్మ..వ్యూహం సినిమా టీజర్ గురించే చర్చించినట్టు సమాచారం. కొన్ని కట్స్‌ని ముఖ్యమంత్రి జగన్‌కు చూపించినట్టు తెలుస్తోంది. అప్పుడే టీజర్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్టు సమాచారం. 


Also read: Malli Pelli On OTT: ఇవాళ్టి రాత్రి నుంచే ఓటిటిలోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook