Rana Daggubati Health : కంటి చూపు కనిపించదు.. కిడ్నీ సమస్యలు.. మొదటి సారి నోరు విప్పిన రానా
Rana Daggubati Corneal Surgery రానా దగ్గుబాటి తాజాగా తన అనారోగ్య సమస్యల మీద నోరు విప్పాడు. కిడ్నీ సర్జరీ జరిగిందని, అలానే కంటిచూపునకు సంబంధించిన సర్జరీ కూడా జరిగిందని చెప్పుకొచ్చాడు. తనకు సరిగ్గా కనిపించదనే విషయాన్ని కూడా చెప్పేశాడు.
Rana Daggubati Corneal Surgery రానా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అందుకే బక్క చిక్కి పోయాడని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అరణ్య సినిమా టైంలో రానా ఆరోగ్య సమస్యలపై ఎక్కువగా రూమర్లు వచ్చాయి. అరణ్య షూటింగ్ సమయంలో రానా హెల్త్ సమస్యలు రావడం, వెంటనే అమెరికాకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించినట్టు టాక్ వచ్చింది.
అయితే ఇప్పుడు రానా తన హెల్త్ సమస్యల గురించి చెప్పాడు. తనకు చూపు అంత సరిగ్గా కనిపించదని, ఆ విషయాన్ని ఓ చిన్న పిల్లాడి వల్ల బయట పెట్టానని అన్నాడు. ఓ చిన్న బాబు తన తల్లికి చూపు కనిపించడం లేదని బాధపడుతూ ఉన్నాడట. అదేమీ అంత పెద్ద ప్రాబ్లం కాదని, తనకున్న సమస్య గురించి కూడా చెప్పాడట. నా కుడి కన్నుతో నేను చూడలేను.. సరిగ్గా కనిపించదు అని రానా అసలు విషయాన్ని చెప్పాడు. అయితే కార్నియల్ సర్జరీ తరువాత అంతా సెట్ అయిందని చెప్పుకొచ్చాడు.
చాలా మంది ఇలాంటి సమస్యల తరువాత కుంగిపోతారు. సర్జరీలు చేసుకున్నా, తగ్గినా కూడా ఇంకా అదే బాధలో ఉంటారు.. నాకు కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది.. ఆ తరువాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది.. నేను ఓ టర్మినేటర్ టైపు. అయినా నేను బతికే ఉన్నాను.. లైఫ్ అనేది ముందుకు సాగించాల్సిందే అని రానా చెప్పుకొచ్చాడు.
రానా ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. రానా నాయుడు వెబ్ సిరీస్‌లో ఎంత దారుణమైన సీన్లున్నాయో అందరికీ తెలిసిందే. నిండా బూతులు, శృంగార సన్నివేశాలుండటంతో జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ సిరీస్ వరల్డ్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది.
Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook