రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల వివాహం ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) ఆగస్టు 8న అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసినదే. రానా, మిహీకల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీల నుండి, రానా అభిమానుల నుండి సోషల్ మీడియాలో ఈ జంటకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఐతే, కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు డెయిరీ మిల్క్ బ్రాండ్ అముల్ ఇండియా నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ లభించింది. రానా, మిహీకల యానిమేటెడ్ డూడుల్‌ను అమూల్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో "# అముల్ టొపికల్: ది రానా-మిహీక 'షాదీ' ఇంటర్నెట్ సెన్సేషన్!" అనే క్యాప్షన్‌తో షేర్ చేసుకుంది. అందులో వారి యానిమేటెడ్ వెర్షన్లు బ్రెడ్, బటర్‌ను ఒకరికొకరు తినిపించడాన్ని చూడవచ్చు. వారితో పాటు, అమూల్ బ్రాండ్ ఐకానిక్ మస్కట్ అముల్ బేబీ కూడా చీరలో నిలబడి బ్రెడ్, బటర్ ప్లేట్‌ను పట్టుకొని ఉండడం చూడవచ్చు. డెయిరీ బ్రాండ్ చిత్రంపై "దగ్గుబటర్లీ వెడ్డింగ్! రానా, యే ఖానా!" అని రాసి ఉంది. అముల్ నుండి వచ్చిన స్పెషల్ ట్వీట్‌కి రానా స్పందిస్తూ.. ఆ సంస్థకు "ధన్యవాదాలు" తెలిపారు. అమూల్ తరచుగా మన దేశంలో జరిగే వివిధ సంఘటనలపై అందమైన, ఆసక్తికరమైన డూడుల్‌లను క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. Also read: యాపిల్ వీగన్ పై తయారు చేసిన పవన్ కల్యాణ్ కూతురు ఆద్య



రానా దగ్గుబాటి, మిహీక వివాహానికి నాగ చైతన్య, సమంత, అల్లు అర్జున్, రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కామినేని వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వం విధించిన కొవిడ్-19 మార్గదర్శకాలు ( COVID-19 guidelines ) ప్రకారం అన్ని భద్రతా చర్యలతో ఆతిథ్య ఏర్పాట్లు చేశారు. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తిని అరికట్టడానికి వారు వివాహ వేదికను బయో-సేఫ్టీ బబుల్‌గా మార్చారు. పెళ్లి తరువాత, ఆగస్ట్ 10న దగ్గుబాటి వారి ఇంట్లో రానా, మిహీకలు సత్యనారాయణ పూజ జరిపించారు. ఆ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also read: Renu Desai: లగ్జరీ కార్లు అమ్మేస్తున్న రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా ?