తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్ మూవీస్ మంచి విజయాన్ని సాధించే విషయం తెలిసిందే. చాలా మంది ఫ్యాన్స్ తమ ఫేవరిట్ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుంది భావిస్తారు. తాజాగా టాలీవుడ్ లో ( Tollywood ) మరో మల్టీ స్టారర్ మూవీ ఎనౌన్స్ అయింది. దగ్గుబాటి కుటుంబం నుంచి ఈ సారి మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | Thimmarusu: చట్టానికి న్యాయానికి... పాటపై బ్రహ్మాజి లిప్ సింక్...రవి బాబు రియాక్షన్


ఈ విషయాన్ని భల్లాల దేవ రానా దగ్గుబాటి ( Rana Daggubati ) ప్రకటించాడు. బాబాయ్ తో సినిమా చేయనున్నటు కన్ఫర్మ్ చేశాడు రానా. విక్టరీ వెంకటేష్, తను కలిసి ఒక సినిమా చేయాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాము. స్క్రిప్ట్ కోసం వెతికాము. అయితే కరోనావైరస్ వల్ల లాక్ డౌన్ సమయంలో ఆ స్క్రిప్ట్ దొరికింది అని తెలిపాడు రానా.



Also Read | Corona Vaccine Updates:  కోవిడ్-19 వ్యాక్సిన్ ముందుగా లభించేది ఈ 30 కోట్ల మందికే,  వివరాలు చదవండి!


బాబాయ్ వెంకటేష్ తో ( Victory Venkatesh ) కలిసి చేయనున్న మల్టిస్టారర్ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని తెలిపాడు రానా దగ్గుపాటి. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ బాబు ఈ మూవీని తెరకెక్కించనున్నాడు అని తెలుస్తోంది. అయితే రానా నటించిన కృష్ణం వందే జగద్గురంలో వెంటకేష్ అతిథి పాత్రలో కనిపించాడు.Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి


ప్రస్తుతం రానా దగ్గుబాటి హాతీ మేరా సాథీ మూవీలో ( Hathi Mera Saathi ) నటిస్తున్నాడు. అదే సమయంలో విక్టరీ వెంకటేష్ నారప్ప ( Narappa) మూవీలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మళ్లీ ప్రారంభం అయింది. నారప్ప మూవీలో ప్రియమణి కథానాయికగా నటిస్తోంది.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR