Rana Daggubati - Daggubati Venkatesh's Rana Naidu Official Teaser Review: ఒకప్పుడు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైన హీరోలు ఇప్పుడు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రాణా కలిసి రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవన్ సూపర్ హిట్గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ని కరమ్ అన్షుమాన్ డైరెక్ట్ చేశారు.  ఈ సిరీస్ లో రానా నాయుడు పాత్రలో రానా కనిపించబోతుండగా ఆయన తండ్రి పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నట్లుగా తాజాగా విడుదలైన టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సిరీస్ నుంచి తాజాగా టీజర్ విడుదల చేయగా ఆ టీజర్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది.


సాయం కావాలా అంటూ రానా డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులలో అంచనాలను రేకెత్తించే విధంగా సాగింది. ఈ టీజర్ ను బట్టి మనం పరిశీలిస్తే సెలబ్రిటీలకు ఏదైనా ఒక కష్టం వస్తే దాన్ని క్లియర్ చేసే వ్యక్తిగా రానా కనిపిస్తున్నాడు. ఒకరకంగా పూర్తిస్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వస్తుంది. ఇక వెంకటేష్ ఒక ముసలి వ్యక్తిగా జైలు నుంచి విడుదలవుతున్నట్లుగా చూపించారు.


తండ్రి కొడుకులుగా రానా వెంకటేష్ కనిపించబోతుండగా టీజర్ క్లైమాక్స్లో వెంకటేష్ తల మీదే రానా గన్ ఎక్కుపెట్టిన షాట్ సిరీస్ మీద అంచనాలు పెంచేస్తోంది. ఒక్క దెబ్బతో ఈ టీజర్ తో మేకర్స్ వెబ్ సిరీస్ మీద అంజనాలు పెంచేసారని చెప్పొచ్చు. పలు భాషలకు చెందిన నటీనటులు కూడా ఈ సిరీస్ లో భాగమయ్యారు. నెట్ఫ్లిక్ సంస్థ స్వయంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో అంటే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తోంది. ఇక ఈ టీజర్ ద్వారా ఒక్కసారిగా సిరీస్ మీద అంచనాలు పెంచేశారు అని చెప్పక తప్పదు.


Also Read: Oke Oka Jeevitham: ఓటీటీలోకి శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'... స్ట్రీమింగ్‌ అందులోనే..!


Also Read: Tollywood: జూనియర్ ఎన్టీఆర్‌తో వివి వినాయక్ అదుర్స్ సీక్వెల్, తదుపరి సినిమా




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook