Bellam Gavvalu Recipe In Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వీట్స్‌లో బెల్లం గవ్వలు ఒకటి. తూర్పుగోదావరి తో పాటు ఇతర జిల్లాల్లో వీటి తయారీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. గోధుమ, మైదా పిండితో తయారు చేసే ఈ బెల్లం గవ్వలను పిల్లలనుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పండుగలకు వీటిని దేవతామూర్తులకు నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇవి చూడడానికి ఎంతో చిన్నవిగా ఉన్న రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ రెసిపీ భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అయితే వీటిని తయారు చేసుకునే క్రమంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు దీనికి కారణంగా సరైన రుచి పొందలేకపోతున్నారు. ఇకనుంచి ఆ పొరపాట్లను మానుకోండి ఇలా మేమందించే సింపుల్ టిప్స్ తో సులభంగా బెల్లం గవ్వలను తయారు చేసుకోండి.
బెల్లం గవ్వల తయారీ విధానం
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - ఒక కప్పు
మైదా - 1 కప్పులు
బెల్లం - 1 1/2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/2 టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)
నూనె - వేయించడానికి
తయారీ విధానం:
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో బెల్లాన్ని పెట్టి బాగా తురుముకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక గిన్నెలో మైదాపిండి గోధుమపిండి యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ అచ్చం పూరీల పిండిలా తయారు చేసుకోండి.
ఆ తర్వాత ఈ పిండిని చిన్న సైజు ఉండల్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మార్కెట్లో లభించే గవ్వల తయారీ అచ్చులో చిన్న చిన్న పిండి ముద్దలను పెట్టి ఒత్తుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఒత్తుకున్న గవ్వలను ఒక ప్లేట్లో పెట్టుకుని, స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకొని వాటిని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మరోసారి స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని వేసి ఆనకం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పట్టిన తర్వాత గవ్వలన్నిటిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతే సులభంగా అద్భుతమైన రుచి కలిగిన బెల్లం గవ్వలా రెసిపీ తయారైనట్లే.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
బెల్లం గవ్వాలను తయారు చేసుకునే క్రమంలో చాలామంది కొద్దికొద్దిగా మాత్రమే బెల్లాన్ని వినియోగిస్తూ ఉంటారు. తీపి ఎక్కువగా కావాలనుకునేవారు బెల్లాన్ని ఎక్కువ మోతాదులో వినియోగించవచ్చు.
బెల్లంగవ్వలను నూనెలో వేయించే క్రమంలో బంగాళదుంప రంగు వచ్చేవరకు మాత్రమే బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వేయించడం వల్ల టేస్ట్ పోయే అవకాశాలు ఉన్నాయి.
కావాలనుకుంటే బెల్లం గవ్వలలో శనగపిండిని కూడా వినియోగించవచ్చు ఈ పిండిని వినియోగించడం వల్ల అవి మరింత కరకరగా వస్తాయి.
బెల్లం గవ్వలను తయారు చేసుకున్న తర్వాత కేవలం గాలి చొరని డబ్బాల్లో మాత్రమే భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి