Rana Daggubati’s net worth: ఇప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన దగ్గుబాటి రానా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడంతో పాటు అనేక విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ రామానాయుడు కుమారుడు సురేష్ బాబు కుమారుడే. ఈ రానా అసలు పేరు రామానాయుడు కాగా పేరు పెద్దగా అయిపోయిందని ఇంట్లో వాళ్ళు రానా అని పిలవడం మొదలుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే పేరు స్క్రీన్ నేమ్ గా ఫిక్స్ అయిపోయింది. రానా 2010 లో విడుదలైన లీడర్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఆయనకు బ్రేక్ వచ్చిన సినిమా బాహుబలి అనే చెప్పాలి. బాహుబలిలో విలన్ పాత్రలో నటించిన రాణా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. బాహుబలి బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సూపర్ హిట్ లుగా నిలిచిన తర్వాత రానా స్వయంగా హీరోగా చేస్తున్న సినిమాలు ఏవీ వర్కౌట్ కావడం లేదు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉండడంతో పలు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కేవలం సినిమా నిర్మాణం మాత్రమే కాదు పలు స్టార్టప్ కంపెనీలు కూడా రానా ప్రారంభించాడు.


అయితే ఆయన లగ్జరియస్ లైఫ్ స్టైల్ చూసి ఆయనకు వెనకాల కోట్ల ఆస్తి ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే రానా ఆస్తి ఎంత ఉంది? ఆయన సినిమాల మీద ఎంత సంపాదిస్తున్నాడు? అనే విషయాల మీద ఒకసారి లుక్ వేద్దాం. 2023వ సంవత్సరానికి గాను ఆయన ఏడాదికి 8:50 కోట్ల రూపాయలు యావరేజ్ గా సంపాదిస్తున్నాడట. ఎక్కువగా ఆయనకు యాక్టింగ్ మీదనే రెమ్యూనరేషన్ వస్తుండగా తర్వాత బిజినెస్ లో కొన్ని పెట్టుబడుల ద్వారా వాటాలు, బ్రాండ్ ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్ ల ద్వారా డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది.


రానా రెమ్యునరేషన్:


ఇక ఆయన ఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు చార్జి చేస్తారట. అంటే దాదాపుగా నెలకు మినిమం 50 లక్షల వరకు డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగే ఒక్కొక్క బ్రాండ్ కి ప్రమోట్ చేయాలంటే 70 నుంచి 80 లక్షలు చార్జ్ చేస్తున్నాడు. ఆయన సియట్ టైర్లు, రామరాజు కాటన్, కోకోకోలా స్మార్ట్ వాటర్, ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.


రానా కార్లు:


ఇక రానా దగ్గర పలు ఆసక్తికరమైన కార్లు ఉన్నాయి. ఆయన దగ్గర బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారొకటి, జాగ్వార్ ఎక్సెస్ కారు ఒకటి, మెర్సీడెస్ బెంజ్ జిఎల్ 350 సిడిఐ ఒకటి, హోండా అకార్డ్, హోండా సిఆర్వి కారులు ఉన్నాయి. ఒకప్పుడు రానా దగ్గుబాటి సురేష్ బాబు తో కలిసి ఆయన నివాసంలోనే ఉండేవాడు కానీ వివాహం జరిగిన తర్వాత ఫిలింనగర్లో మరో నివాసంలోకి రానా షిఫ్ట్ అయ్యాడు. అందులో మిహీకా బజాజ్ తో కలిసి నివసిస్తున్నాడు. ఇక రానాకి తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి దాదాపు 2000 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఎక్కువగా స్థలాల మీద వీరి కుటుంబం పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. 


Also Read: Balagam Collections: బలగం 'బలం' ఇదీ.. ఓటీటీలో రిలీజయ్యాక కూడా థియేటర్లకు క్యూ కడుతున్న జనాలు!


Also Read: Little krishna: ఈ ఫొటో ఎవరిదో గుర్తు పట్టారా? తెలుగోడు మీసం మెలేసేలా చేసిన డైరెక్టర్ ఈయన?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook