`హాథీ మేరే సాథీ` రీమేక్‌లో రానా..?
గతంలో ప్రభు సాల్మన్ ఏనుగు కథ ప్రధానాంశంగా తమిళంలో `గుమ్కీ` చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే.
1971లో రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన హిందీ చిత్రం "హాథీ మేరే సాథీ" ఎంత పెద్ద హిట్ చిత్రమో తెలియంది కాదు. రాజేష్ ఖన్నా కెరీర్‌లోని అతి పెద్ద హిట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు అదే చిత్రాన్ని నటుడు రానా రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి.
ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం దీపావళికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే బాలీవుడ్ చిత్ర విమర్శకులు తరన్ ఆదర్శ్ తన ట్విటర్ పేజీ ద్వారా వెల్లడించారు. గతంలో ప్రభు సాల్మన్ ఏనుగు కథ ప్రధానాంశంగా తమిళంలో "గుమ్కీ" చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుందని వినికిడి.