Ranbir Kapoor Ramayan Update: రామాయణాన్ని మన భారతదేశంలో ఎన్ని భాషల వాళ్ళు.. ఎన్నిసార్లు చేసినా.. సినీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. తెలుగులో ఇప్పటికే ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఈ మధ్యనే ప్రభాస్ సైతం రామాయణం ఆధారంగా ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ ఇదే రామాయణంతో తన టెస్ట్ చేసుకోబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందు నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో రాముడిగా.. రణబీర్ కపూర్, సీతగా.. సాయి పల్లవి, రావణుడిగా యాష్ కనిపిస్తారు అని వార్తలు రావడమే. వీటిల్లో రెండు విషయాలను మాత్రం రుజువు చేస్తూ ఈ మధ్యనే రణబీర్ కపూర్.. రాముడి వేషంలో.. సాయి పల్లవి.. సీత వేషంలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.


దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆంజనేయుడిగా సన్నీ డియోల్ తో పాటు రకుల్, లారా దత్తా వంటి నటీనటులు కీలకపాత్రలు పోషించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఇబ్బందుల్లో పడినట్లు వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్, మధు మంతెన బృందం ప్రైమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సినవి ఇంకా చెల్లించలేదని.. కాబట్టి ఈ చిత్రాన్ని నిర్మించకూడదు అని ప్రకటన విడుదల చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ఇటు మేకర్స్ స్పందించలేదు.


ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ మారుస్తున్నారట. ఈ సినిమాకి దర్శకుడు గాడ్ పవర్ అనే కొత్త టైటిల్ ఫిక్స్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.  కాగా ఈ సినిమా షూటింగ్ కనీసం 600 రోజులు జరుగుతుందని..ఈ చిత్రం 2027లో విడుదల చేయడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు అని కూడా సమాచారం.


Also Read: RCB Playoff: కోహ్లీని చూసి ఏడ్చేసిన అనుష్క శర్మ.. బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరికతో కన్నీళ్లు


Also Read: IPL MI vs LSG: ముంబై ఇండియన్స్‌ అట్టర్ ప్లాప్‌ షో.. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో చిత్తు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter