Animal OTT Scenes: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన యానిమల్ సినిమా దాదాపు 800 కోట్ల కలెక్షన్స్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో విమర్శలు వచ్చిన ఈ చిత్రానికి కొంతమంది ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు కూడా అదే లెవెల్ లో వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాని జనవరి 26న ఓటీటీలో విడుదల చేస్తున్నామని గత కొద్ది రోజులు ముందే ఈ చిత్ర  యూనిట్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. కాగా అవన్నీ తొలగించుకొని ఈ చిత్రం జనవరి 26 న నెట్ ఫ్లిక్స్ లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. యానిమ‌ల్ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు వంద కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఓటిటీ వర్షన్ లో థియేటర్ వర్షన్ కన్నా కూడా ఎక్కువ సీన్లు ఉంటాయని.. ముందు నుంచే చెబుతూ వచ్చారు సందీప్ రెడ్డి వంగా .


థియేట‌ర్ వెర్ష‌న్‌తో పోలిస్తే యానిమ‌ల్‌ ఓటీటీ వెర్ష‌న్‌లో చాలా మార్పులు చేసిన‌ట్లు కొన్ని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. థియేట‌ర్ వెర్ష‌న్‌ మూడు గంట‌ల ఇర‌వై ఒక్క నిమిషాల కాగా ఓటీటీలో మాత్రం మూడున్న‌ర గంట‌ల పైనే నిడివితో యానిమ‌ల్‌ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. అంతే దాదాపు ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల నిడివి పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 


ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ వర్షన్ లో అదనంగా ర‌ష్మిక మంద‌న్న సీన్స్‌ను యాడ్ చెయ్యబోతున్నారట. ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ నిడివి ఎక్కువ‌నే ఆలోచ‌న‌లో థియేట‌ర్ల‌లో క‌ట్ చేశారు. కానీ ఆ సీన్స్ అన్నీ ఇప్పుడు ఓటీటీ వెర్ష‌న్‌కు యాడ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఓటిటి వర్షన్ లో ర‌ణ్‌బీర్‌, ర‌ష్మిక‌ల‌ లిప్‌లాక్ సీన్స్ కూడా క‌ల‌ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. 


రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ ముందుగానే యానిమల్ చిత్రంలో ఎక్కువ. ఇక మళ్లీ యాడ్ చేస్తున్నారు అని తెలియడంతో ఈ ఓటీటీ వర్షన్ లో రొమాంటిక్ దోస్ ఏ లెవెల్ కి వెళ్ళిబోతుందో అని సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. మరి దీనికి జవాబు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలొ బాబీ డియోల్ విల‌న్‌గా న‌టించాడు. రణ్‌బీర్‌క‌పూర్ తండ్రిగా అనిల్ క‌పూర్ న‌టించాడు. త్రిప్తి దిమ్రీ కీల‌క పాత్ర పోషించింది. టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి సందీప్ వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగా ఈ మూవీని నిర్మించాడు.


Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter