అలియా భట్‌తో డేటింగ్ నిజమేనన్న రణ్‌బీర్ కపూర్
డేటింగ్లో బాలీవుడ్ జంట
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, నటి అలియా భట్ ప్రేమించుకుంటున్నట్టు ఇటీవల కాలంలో బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ బాలీవుడ్ జంట డేటింగ్ చేస్తోంది అంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్నిరోజులు దీనిపై ఓ స్పష్టత అనేది లేదు. కానీ తాజాగా జీక్యూ ఇండియా మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్ అందులో అనేక అంశాలను వెల్లడించాడు. అలియా భట్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్త నిజమేనా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తమకు కూడా ఇప్పుడిప్పుడే కొత్త అని అంగీకరిస్తున్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అలియాతో డేటింగ్ గురించి తాను ఎక్కువగా మాట్లాడకూడదు అని చాలా క్లుప్తంగా సెలవిచ్చాడు రణ్‌బీర్ కపూర్ జీక్యూ ఇండియా మ్యాగజైన్ జూన్ సంచికలో ప్రచురించిన ఈ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించాడట.
అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న బ్రహ్మస్త్ర సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట కలిసి నటిస్తోంది. ఈ సినిమా షూటింగే ఈ ఇద్దరిని మరింత చేరువ చేసింది.