టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కెరీర్ బెస్ట్ సినిమాలుగా మగధీర, రంగస్థలం తరువాత ప్రపంచస్థాయి ప్రాచుర్యం సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో రంగస్థలం ఓ మైలురాయిగా చెప్పాలి. ఇప్పుడీ సినిమా సీక్వెల్‌పై అప్‌డేట్ వెలువడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కెరీర్‌లో అద్భుతమైన సినిమాల్లో ఒకటి మగధీర. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మెగా హిట్‌గా నిలిచింది. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో కాంబో మరోసారి హిట్ అయింది. ఇప్పుడీ సినిమా గ్లోబల్ అవార్డులు దక్కించుకునేందుకు పోటీ పడుతోంది. ఆస్కార్ అవార్డు రేసులో ఉందీ సినిమా. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల రూపంలో ఇద్దరు అగ్రనటుల్ని సమానంగా నిలబెట్టి తీసిన సినిమా కావడంతో అటు అభిమానులెవరూ హర్ట్ కాలేదు. ఇదంతా ఓ ఎత్తైతే రామ్‌చరణ్ నటనలో అద్భుత కోణాన్ని ఆవిష్కరించిన సినిమా మాత్రం రంగస్థలమే. 


సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. రంగస్థలం సీక్వెల్ ఉందా లేదా అనే సందేహం చాలాకాలంగా ఉంది. ఇప్పుడీ సందేహానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరతీసేశారు. రాజమౌళి చెప్పిన మాటల ప్రకారం..రంగస్థలం సీక్వెల్ ఉంటుందనే తెలుస్తోంది. చరణ్ సుకుమార్ కలిసి చేయబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నానని..చిత్ర ప్రారంభ సన్నివేశాన్ని చరణ్ తనకు వివరించాడని రాజమౌళి చెప్పారు. ఆ సన్నివేశం నిజంగా బాగుందన్నారు రాజమౌళి. ఆ ఇద్దరూ త్వరలో జతకట్టి ఆ సినిమా చేస్తారని ఎదురుచూస్తున్నట్టుగా రాజమౌళి చెప్పడంతో అందరిలో ఉన్న సందేహాలకు తెరపడింది. అంటే రంగస్థలం సీక్వెల్ వస్తున్నట్టేనని టాక్ ప్రారంభమైంది. పుష్ప 2 తరువాత సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించవచ్చని తెలుస్తోంది. 


రాజమౌళి మాటల్ని బట్టి సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో కొత్త సినిమా రాకపోవచ్చని..అది రంగస్థలం సీక్వెల్ మాత్రమేనని తెలుస్తోంది. రాజమౌళి లీక్ చేసిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Also read: Bigg Boss Sohel : పూరి జగన్నాథ్ పెంపకం అలాంటిది!.. ఆకాష్ పూరిపై బిగ్ బాస్ సోహెల్ కామెంట్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook