1980 కాలం నాటి రోజులంటే ఎలా ఉంటాయి..? అసలే సెల్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, వాట్సాప్‌లు లేని రోజులు. ఇప్పుడైతే గ్రామాలు కాస్తోకూస్తో అప్డేట్ అవుతున్నాయి కానీ.. అప్పట్లో ఎలా ఉండేవో తలచుకుంటూనే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ.. ఆ రోజులలో ఒక పల్లెటూరిలో జరిగిన ప్రేమకథను "రంగస్థలం" పేరుతో రామ్‌చరణ్ హీరోగా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సినిమా సెట్స్‌ని ఇటీవలే తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు ఈ మెగా పవర్‌స్టార్. కిరాణకొట్టు, గోలీసోడా, గోల్డ్ స్పాట్ డ్రింక్, ఎద్దులబండి, పిండిమర గోడలపైన సినిమా పోస్టర్లు.. ఒక వింటేజ్ లుక్ ఇస్తోంది ఈ చిత్రం సెట్. ఈ సెట్స్ నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తున్నాయి అని కూడా పోస్టుచేశారు చరణ్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న "రంగస్థలం"లో రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.


మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా సెట్ వేయడానికే కనీసం 5 కోట్లు ఖర్చు అయ్యిందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


 <>