Actor crying: తన ఫేవరైట్ హీరోను చూసి బోరున ఏడ్చిన మరో స్టార్ హీరో
Ranveer Singh breaks down : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తాజాగా హోస్ట్ చేస్తోన్న గేమ్ షో పేరు.. ది బిగ్ పిక్చర్. తాజా ఎపిసోడ్‌కు గెస్ట్‌గా రణవీర్ సింగ్ ఆరాధ్య దైవంగా భావించే బాలీవుడ్ నటుడు గోవింద వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు రణవీర్ సింగ్.
Ranveer Singh breaks down after meeting his God Govinda, Watch The Big Picture latest promo : రణవీర్ సింగ్ తన చిన్ననాటి నుంచి ఆరాధ్యదైవంగా భావించే నటుడు గోవింద. మరి తన ఆరాధ్య దైవం తాను హోస్ట్ చేసే షోకు వస్తే.. ఆ హీరో ఆనందానికి అవధులుండవు కదా. అలాంటి సంఘటనే జరిగింది. రణవీర్.. 'దేవుడి' గా భావించే గోవింద.. ది బిగ్ పిక్చర్ (The Big Picture) షోకు రావడంతో రణవీర్ సింగ్ (Ranveer Singh) భావోద్వేగానికి గురయ్యాడు. తన ఫేవరైట్ హీరోను చూసి బోరున ఏడ్చేశాడు ఈ స్టార్ హీరో.
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ (Bollywood hero Ranveer Singh) తాజాగా హోస్ట్ చేస్తోన్న గేమ్ షో పేరు... ది బిగ్ పిక్చర్ (The Big Picture). ఈ షో ఫస్ట్ సిరీస్ ప్రస్తుతం రన్ అవుతోంది. అక్టోబర్, 16, 2021న ప్రారంభమైన ఈ గేమ్ షో.. కలర్స్ టీవీలో, ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్‌లో టెలికాస్ట్ అవుతోంది. జనరల్ నాలెడ్జ్.. ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో ఈ షోను ఆద్యంతం రక్తికట్టిస్తుంటాడు హోస్ట్ రణవీర్ సింగ్. ఈ షోలో ఫోటోలను చూపించి షోకు వచ్చిన అతిథులను జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అతిథులుగా (Guests) అందరూ సెలబ్రిటీలే వస్తుంటారు. అలాగే ప్రేక్షకులు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ఉంటారు.
ఇక తాజా ఎపిసోడ్‌కు గెస్ట్‌గా రణవీర్ సింగ్ ఆరాధ్య దైవం బాలీవుడ్ నటుడు గోవింద (Bollywood actor Govinda) వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ హోస్ట్ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు రణవీర్ సింగ్.
ఇందుకు సంబధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతోంది. తన షోకు గెస్ట్‌గా వచ్చిన గోవిందను చూసి రణ్‌వీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అంతేకాదు.. గోవిందను ఇంట్రడ్యూస్ చేసే సమయంలో తన ‘దేవుడు’ అంటూ రణవీర్ పేర్కొన్నాడు. “ఈ రోజు... ఈ వేదికపైకి నా దేవుడే స్వయంగా వస్తున్నాడు.. ది వన్ అండ్ ఓన్లీ.. ది హీరో నంబర్ వన్.. గోవిందా" అంటూ గోవింద గురించి అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చారు రణ్‌వీర్ సింగ్.
ఇక గోవింద వేదికపైకి రాగానే ఆయన పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. గోవిందను చూసి ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు రణవీర్. వారిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా.. యుపి వాలా తుమ్కా.. పాటలకు డ్యాన్స్ చేశారు. తాను ర్యాపింగ్ గల్లీ బాయ్ సమయంలో నేర్చుకోలేదని.. తన ఫేవరేట్ హీరో గోవింద (Favorite hero Govinda) పాటలను చూసి నేర్చుకున్నానని చెప్పాడు రణవీర్. ఇక గోవింద కుటుంబ సభ్యులు.. ఆయన భార్య సునీత, కూతురు టీనా, కుమారుడు యశ్వర్దన్ అహుజా కూడా వీడియో కాల్స్ ద్వారా వీరితో కలిసి ఎంజాయ్ చేశారు.
Also Read : Chiranjeevi: సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండను: చిరంజీవి
ఒక గోవిందపై తనకున్న అభిమానాన్ని తరుచూ రణ్‌వీర్ సింగ్ చాటుకుంటూనే ఉంటాడు. 2014లో వీరిద్దరూ కలిసి కిల్ దిల్ మూవీలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో కూడా రణ్‌వీర్.. గోవిదంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. గోవింద ఒక లెజెండ్ అని ఆయన సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టపమని చెప్పుకొచ్చాడు రణవీర్. ఆయనుకున్న కోట్లాది మంది అభిమానుల్లో.. తాను కూడా ఒక వీరాభిమాని అని చెప్పాడు రణవీర్. తాను గోవింద మూవీల్లో కొన్ని సినిమాలను వందసార్ల కంటే ఎక్కువే చూశానంటూ చెప్పుకొచ్చాడు రణవీర్. ఇక ఆయన పాటలంటే తనకు పిచ్చి అని పేర్కొన్నారు.
గోవింద అన్ని సినిమాలు తనకు నచ్చవని.. కానీ తనకు గోవింద అంటే ఎంతో ఇష్టమని అప్పట్లో చెప్పారు రణవీర్.ఇలా గోవిందపై ఎప్పుడూ అభిమానాన్ని చూపించే రణవీర్.. (Ranveer) ఇప్పుడు తాను హోస్ట్ చేసే షోకు గెస్ట్‌గా తన అభిమాన హీరో రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం అలరించేలా ఉండనుంది.
Also Read : Pushpa Movie Collection: బాలీవుడ్ లో పుష్పరాజ్ జోరు.. బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి