Pushpa Movie Collection: బాలీవుడ్ లో పుష్పరాజ్ జోరు.. బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం!

Pushpa Movie Collection: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' (Pushpa Movie) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కలెక్షన్ల సునామీని తీసుకొచ్చింది. హిందీలో ఇప్పటికే రూ.50 కోట్లకు (Pushpa Collection Till Now) పైగా సాధించిన ఈ చిత్రం.. రూ.75 కోట్లకు చేరువై సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 12:38 PM IST
    • రెండు వారాల తర్వాత కూడా తగ్గని 'పుష్ప' జోరు
    • రూ.300 కోట్లపైగా వసూళ్లు సాధించిన మూవీ
    • బాలీవుడ్ లో రూ.75 కోట్లకు చేరువైన కలెక్షన్లు
Pushpa Movie Collection: బాలీవుడ్ లో పుష్పరాజ్ జోరు.. బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం!

Pushpa Movie Collection: అల్లు అర్జున్​ హీరోగా నటించిన 'పుష్ప ది రైజ్​' (Pushpa Movie) ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సహా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. 

సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ కు చేరగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు (Pushpa Collection Worldwide) రాబట్టింది. ఇదే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది (2021) అత్యధిక కలెక్షన్స్ సాధించిన తొలి మూవీగా 'పుష్ప ది రైజ్' నిలిచింది. 

అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలున్నాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో థియేటర్లు ఎక్కువగా మూతవేయడం సహా కొన్ని చోట్ల 50 శాతం సామర్థ్యంతో సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో 'పుష్ప' హిందీ వర్షెన్ కు రూ.56 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం సరికొత్త రికార్డు అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

ఇదే జోరు కొనసాగితే సంక్రాంతి లోపు రూ.500 కోట్ల (Pushpa Collection Till Now) కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అటు బాలీవుడ్ తో పాటు విదేశాల్లోనూ కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప ది రైజ్' తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇది తొలి భాగం మాత్రమే. 'పుష్ప ది రూల్' పేరుతో రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది.

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్​​ ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. యాంకర్​ అనసూయ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటం సాంగ్​ (Pushpa Collection Worldwide) చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందించారు. నవీన్ యెరనేని. వై. రవి శంకర్​ నిర్మాతలుగా ఉన్నారు. 

Also Read: Saana Kastam Song Promo: 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో.. మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు

Also Read: Kajal Aggarwal Pregnant: గుడ్ న్యూస్ చెప్పిన గౌతమ్ కిచ్లు.. తల్లికాబోతున్న కాజల్ అగర్వాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News