బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునె పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇవాళ కొత్తది కాదు. గత కొన్ని నెలలుగా వీళ్లిద్దరి పెళ్లి గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరి పెళ్లికి నవంబర్ 10వ తేదీన ముహూర్తం కుదిరినట్టు గతంలో అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వీళ్ల పెళ్లి తేదీలో మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 20న ఇటలీలోని లేక్ కొమొ వేదికగా రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునె పెళ్లి చేసుకోనున్నట్టు మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ పెళ్లికి కేవలం ఓ 30 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్టు సమాచారం.


ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బాలీవుడ్ నుంచి గతంలో ఆదిత్యా చోప్రా-రాణిముఖర్జీ, విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ జంటలు కూడా ఇలాగే ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.