Rashmika Mandanna : రష్మిక మందన మీద గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఏదో మాట్లాడితే.. ఇంకేదో రాసేశారంటూ వాపోయింది. రష్మిక విజయ్ దేవరకొండ మాల్దీవుల ట్రిప్ మీద ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇలా తన మీద వచ్చిన రూమర్లు, నెగెటివిటీ, ట్రోలింగ్ మీద తాజాగా రష్మిక స్పందించింది. ఈ మేరకు ఆమె పోస్ట్ వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'గత కొన్ని రోజులుగా, వారాలు, నెలలు, ఏళ్లుగా నన్ను కొన్ని బాధపెడుతూనే ఉన్నాయి.. ఇప్పుడు నేను వాటిపై మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను.. ఇది ఇంతకు ముందే ఎప్పుడో చేయాల్సింది. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నా కెరీర్ స్టార్ట్ చేసిన క్షణం నుంచి నెగెటివిటీ వస్తూనే ఉంది.. మామూలుగానే ట్రోల్స్, నెగెటివిటీ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయి.


నేను ఎంచుకున్న కెరీర్ అలాంటిదే అని నాకు తెలుసు.. పైగా నేను అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు.. అందరి ప్రేమ నాకు దక్కాలని కూడా అనుకోను.. అలా అని.. వారి నుంచి నెగెటివిటీ వస్తూనే ఉంటుందంటే కుదరదు. మీకు నేను నచ్చలేదని అంటే..ఇలా నెగెటివిటీ, ట్రోలింగ్ చేయడం కాదు కదా?


నేను నా పని మీద ఫోకస్ పెడతాను.. మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకే ప్రయత్నిస్తుంటాను.. నేను చేసే పని వల్ల మీరు సంతోషంగా ఉండాలనే ఆశిస్తాను. దాని కోసమే కష్టపడుతుంటాను. మీరు, నేను గర్వపడే పనులే నేను చేయాలని అనుకుంటాను. నేను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ప్రచారం చేయడం మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అవి నన్ను తక్కువ చేసినట్టుగా అనిపిస్తోంది.


 



నేను ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు తప్పుగా వెళ్లిపోయాయి. నేను చెప్పింది కాకుండా వేరేవి రాస్తున్నారు.. దాని వల్ల నాకు ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్, బయట ఉన్న రిలేషన్స్ దెబ్బ తినే అవకాశాలున్నాయి. మంచి విమర్శల వల్ల నా కెరీర్ ముందుకు వెళ్తుంది.. తప్పులను మార్చుకోవడానికి పని చేస్తాయి.. కానీ ఇలాంటి హేట్, నెగెటివిటీ ఎందుకు?..  ఇన్నేళ్లుగా దాన్ని పట్టించుకోవద్దని అనుకున్నాను.. కానీ అది మరింత హద్దులు దాటుతోంది.. ఇప్పుడు ఇలా బయటకు చెబుతున్నాను అంటే.. మీ అందరి మీద నేను గెలిచినట్టు కాదు.. అలా నేను అనుకోవడం కూడా లేదు.. 


ఈ ద్వేషం వల్ల నాలో మార్పులు రాకూడదని నేను అనుకుంటున్నాను..  మీ అందరూ కురిపించే ప్రేమ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. నాకు ఇంత ధైర్యం వచ్చింది కూడా మీ ప్రేమ వల్లే. నా చుట్టూ ఉండే వాళ్లను ప్రేమించడమే నాకు తెలుసు.. ఇంత వరకు నేను పని చేసిన వాళ్లందరితోనూ ప్రేమగానే ఉన్నాను.. నేను ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉంటాను.. మీ అందరినీ సంతోషంగా ఉంచేందుకు కష్టపడుతూనే ఉంటాను.. అందరి పట్ల కాస్త దయతో మెలగండి.. మేం మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాం. థాంక్యూ' అంటూ రష్మిక మందన ఎమోషనల్ పోస్ట్ వేసింది.


Also Read : Mahesh Babu Daughter Sitara : ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. మహేష్‌ బాబు కూతురు సితార సందడి.. పిక్స్ వైరల్


Also Read :Renu Desai : సమంత ఫ్రెండ్‌కు రేణూ దేశాయ్ విషెస్.. డాక్టర్‌పై పోస్ట్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook