Renu Desai : సమంత ఫ్రెండ్‌కు రేణూ దేశాయ్ విషెస్.. డాక్టర్‌పై పోస్ట్ వైరల్

Renu Desai Birthday Wishes రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో సమంత ఫ్రెండ్ కమ్ డాక్టర్ మంజుల అనగానికి బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 02:58 PM IST
  • నెట్టింట్లో రేణూ దేశాయ్ సందడి
  • సమంత ఫ్రెండ్ బర్త్ డే పార్టీ
  • మంజులకు రేణూ దేశాయ్ విషెస్
Renu Desai : సమంత ఫ్రెండ్‌కు రేణూ దేశాయ్ విషెస్.. డాక్టర్‌పై పోస్ట్ వైరల్

Renu Desai - Dr Manjula Anagani : రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండటం లేదు. ఒకప్పుడు అయితే రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఉండేది. లేదంటే తన పిల్లల గురించి చెబుతూ ఉండేది. వెకేషన్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుండేది. కానీ గత కొన్ని నెలల నుంచి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో కాస్త సైలెంట్‌గా ఉంటోంది. ఇక బుల్లితెరపైనా ఎలాంటి ప్రోగ్రాంలు, ఈవెంట్లు చేయడం లేదు.

రేణూ దేశాయ్ చాలా రోజుల తరువాత సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతోంది. రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణూ దేశాయ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తనకు కథ, తన పాత్ర ఎంతో బాగా నచ్చిందని, ఇలా ఈ చిత్రం పార్ట్ అవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందని రేణూ దేశాయ్ చెబుతుంటుంది. ఇప్పటికే జరిగిన షెడ్యూల్స్‌లో రేణూ దేశాయ్ పాల్గొంది.

ఇక రేణూ దేశాయ్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిచింది. రేణూ దేశాయ్‌తో విడిపోయే సమయంలో తాను భరణంగా తన ఆస్తిని ఇచ్చానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో నాటి విషయాలన్ని ఒక్కసారిగా పైకి లేచాయి. తాను భరణంగా పవన్ కళ్యాణ్‌ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ గతంలో రేణూ దేశాయ్ చెప్పిన మాటలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఇప్పుడు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అవుతోంది. తాజాగా సమంత ఫ్రెండ్ అయిన డాక్టర్ మంజుల బర్త్ డే పార్టీలో మెరిసింది. సమంత గ్యాంగులో నందినీ రెడ్డి, చిన్మయి, సాధన సింగ్, ప్రీతమ్ జుకల్కర్, డాక్టర్ మంజుల ఉంటారన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే మంజుల బర్త్ డే పార్టీకి సమంత కూడా వచ్చి ఉండేది. కానీ సమంతకు ఇప్పుడు హెల్త్ బాగా లేకపోవడంతో ఈ పార్టీకి రానట్టుగా ఉంది.

ఈ బర్త్ డే పార్టీలో రేణూ దేశాయ్ కనిపించింది. మంజులకు విషెస్ చెబుతూ పోస్ట్ వేసింది. నాకు తెలిసిన మంచి, గొప్ప డాక్టర్ మంజులకు హ్యాపీ బర్త్ డే అని రేణూ దేశాయ్ పోస్ట్ వేసింది.

Also Read : Niharika - Brahmanandam : నాకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టేనా?.. బ్రహ్మానందంపై మెగా డాటర్ ఫన్నీ కామెంట్స్

Also Read : Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News