Rashmika Mandanna: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నాపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. సినిమాలతో పాటు యాడ్స్‌లో నటించే రష్మికకు ఓ యాడ్ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రష్మీపై విమర్శలకు కారణమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(Tollywood)క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగుతో పాటు ఇటీవలి కాలంలో హిందీలో కూడా క్రేజ్ సంపాదించుకుంది. ఛలో సినిమాతో తెలుగులో పరిచయమైన రష్మిక మందన్నా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. మిషన్ మజ్ను త్వరలో బాలీవుడ్‌కు వెళ్లనుంది. ఈ నేపధ్యంలో స్టార్‌డమ్ సంపాదించుకున్న రష్మిక..యాడ్స్‌లో కూడా పెద్దఎత్తున నటిస్తోంది. అటు సినిమాలు ఇటు యాడ్స్‌తో బిజీగా గడుపుతున్న రష్మికకు ఇటీవల ఓ యాడ్ ఇబ్బందుల్లో పడేసింది. ఆమె నటింటిన యాడ్ ప్రభావం రష్మికపై విపరీతమైన ట్రోలింగ్‌కు కారణమవుతోంది. 


నేషనల్ క్రష్‌గా అభిమానులతో ట్యాగ్ సంపాదించుకున్న రష్మిక మందన్నాకు(Rashmika Mandanna)ఆ అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. తాజాగా విక్కీ కౌశల్‌తో ఆమె చేసిన ఓ అండర్వేర్ యాడ్ ప్రభావమిది. ఈ యాడ్‌తో ఆమెపై భారీగా విమర్శలు వచ్చాయి. ఈ యాడ్‌లో రష్మిక ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గాఉండగా, విక్కీ యోగా చేస్తుంటాడు. ఆ సమయంలో షర్ట్ కొద్దిగా పైకి లేవడంతో విక్కీ అండర్వేర్ మ్యాచో కంపెనీ పేరు కన్పిస్తుంది. అది చూసిన రష్మిక ఇంప్రెస్ అయి..అండర్వేర్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఈ యాడ్ ఇప్పుడు విమర్శలకు కారణంగా మారింది.ఇలాంటి ఛీప్ యాడ్ ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు కొందరు కామెంట్లు చేశారు. మరి కొందరైతే రష్మిక నుంచి ఇలాంటి ఛీప్ యాడ్ వస్తుందని ఊహించలేదని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇలాంటి యాడ్‌ను రష్మిక మందన్నా ఎలా ఒప్పుకుందని ప్రశ్నిస్తున్నారు. ఈ యాడ్‌లో అమ్మాయిలను తక్కువ చేసి చూపించారనేది మరో విమర్శ. ఈ తరహా యాడ్స్‌లో నటించడం మంచిది కాదని రష్మికకు సూచిస్తున్నారు. 


Also read: Uttar Pradesh Elections 2022: యూపీ ఎన్నికలకై బీజేపీ తీవ్ర కసరత్తు, సిట్టింగ్‌లకు నో ఛాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook