Rashmika Mandanna to act in Ram Pothineni next Film: మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్‌ నటిస్తున్న 20వ చిత్రం ఇది. ఈ సినిమా అధికారిక ప్రకటన అయితే వచ్చింది కానీ.. హీరో తప్ప మిగతా తారాగణం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. ముఖ్యంగా రామ్‌కి జోడిగా ఏ హీరోయిన్‌ నటిస్తోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం రామ్‌ 20వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.. నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారట. ఇప్పటికే రష్మికకు బోయపాటి కథ చెప్పగా.. ఆమెకు లైన్ బాగా నచ్చిందట. రామ్ సరసన హీరోయిన్‌గా చేసేందుకు ఓకే చెప్పిందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


రామ్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ చేసిన అన్ని డబ్బింగ్ సినిమాలు హిందీలో బాగా ఆడాయి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటున్నాయి. అలాగే 'పుష్ప' సినిమాతో రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసినట్లు సమాచారం. రామ్, రష్మిక కాంబో బాగుంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. 


రష్మిక మందన్న, శర్వానంద్‌ కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పుష్ప 2తో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తోంది. ఇక రెడ్ సినిమాతో పెద్ద డిజాస్టర్ అందుకున్న రామ్.. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బోయపాటి శ్రీనుతో సినిమా కాబట్టి హిట్ ఖాయం అని రామ్ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. 


Also Read: Hijab Row: హిజాబ్‌ వివాదం.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు! సర్వత్రా ఉత్కంఠ!!


Also Read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్‌ షేర్‌ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook