Eagle Movie Download: ఒకప్పుడు వరసగా సూపర్ హిట్ లో అందుకున్న రవితేజ కథ కొద్దిరోజులుగా ఫ్లాపులతో సతమతమవుతున్నారు. వరసగా ఫ్లాపులు వస్తుండగా మధ్యలో ఆయనకు క్రాక్, ధమాకా లాంటి చిత్రాలు ఊరట ఇచ్చాయి. అయితే మళ్లీ ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అందుకే ప్రస్తుతం ఈ హీరో తన అంచనాలు అన్ని ఈగల్ సినిమా పైన పెట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కావలసిన ఈ సినిమా థియేటర్స్ ఇబ్బంది వల్ల సంక్రాంతి పోటీ నుంచి వెనకరుగు వేసి ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అయింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుంచి పర్వాలేదు అనిపించుకుంటుంది. కాగా ఇలాంటి టైమ్ లో ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ విడుదలైన విడుదలైన కొన్ని గంటలకి ఈ సినిమా హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. ఈ సినిమా దాదాపు  2 గంటల 28 నిమిషాల  రన్‍టైమ్ తో రాగా ఈ మొత్తం సినిమా ఆన్లైన్ లో పెట్టేయడంతో సినీ ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ విషయం రవితేజ అభిమానులను నిరాశకి గురిచేస్తోంది. మాస్ మహారాజా ఈ సినిమాతో అన్నా మంచి విజయం సాధిస్తారు అనుకుంటే ఈ చిత్రాన్ని ఇలా పైరసీ చెయ్యడం మంచిది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు…


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే ర‌వితేజ లాస్ట్ మూవీ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలిన కానీ ఆ రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ఈగ‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ అద‌ర‌గొట్టింది. ఈగ‌ల్‌ థియేట్రిక‌ల్ రైట్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 21 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఆంధ్రా ఏరియా మొత్తం క‌లిసి దాదాపు ఎనిమిదిన్న‌ర కోట్ల వ‌ర‌కు ఈగ‌ల్ మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. నైజాంలో ఆరు కోట్లు, సీడెడ్‌లో రెండున్న‌ర కోట్ల‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన‌ట్లు తెలిసింది. మరి ఈ పైరసీని ఎదుర్కొని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.


Also Read: Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter