Eagle Collections: ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఎలాగైనా దిగాలి అని షూటింగ్ సెలవేగంగా పూర్తి చేసుకున్న సినిమా రవితేజ ఈగల్. అయితే మిగతా సినిమాల థియేటర్స్ వివాదం వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కోసం రిలీజ్ డేట్ ని పోస్ట్  పోన్ చేసుకుంది ఈ చిత్రం. కాగా సంక్రాంతి నుంచి వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లో విడుదలైంది. రవితేజ కి వరస ఫ్లాపులు రావడంతో ఆయన అభిమానులు అంచనాలు అన్ని ఈగల్ చిత్రం పైనే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కూడా రవితేజని సరికొత్త మేక్ ఓవర్ లో చూపించి అందరిని మెప్పించింది. ఈసారి రవితేజ కి సూపర్ హిట్ రావడం ఖాయం అనుకున్నారు అందరూ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చిత్రం విడుదలయ్యాక ఈ సినిమాకి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ సినిమా యాక్షన్ ఎక్సలెంట్ గా ఉంది అంటుండగా మరి కొంతమంది మాత్రం ఈ చిత్రంపై ఎక్కువగా కేజిఎఫ్ ప్రభావం ఉంది అని మొదటి హాఫ్ అంత కేవలం ఎలివేషన్స్ కోసమే అయిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర కలెక్షన్స్ పైన కూడా చర్చ సాగుతోంది.


ఈగిల్ సినిమాకు దాదాపు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. దానికి తగినట్టుగానే ఈ చిత్రాన్ని ఈ సినిమా మేకర్ అత్యధిక థీయేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో మొత్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చెయ్యగా ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. 


ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు ఈ సినిమా ఓవర్సీస్‌లో.. అమెరికా, కెనడాలో 65K,ఆస్ట్రేలియాలో 8k, యూకే, ఐర్లాండ్‌లో 23k, యూఏఈ, గల్ఫ్‌లో 250 డాలర్లు వసూలు చేసింది. ఇక ఇండియాలో ఏపీ, నైజాంలో 4 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు ఆరు కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ కొంచెం డ్రాప్ అవ్వగా.. మొత్తం పైన ఈ సినిమా నాలుగు కోట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగిందని వినికిడి. రెండో రోజు ఈ చిత్రానికి 4.75 కోట్లు లాగా మొత్తం పైన ఈ సినిమా కలెక్షన్స్ రెండు రోజులకి కలిపి 10 కోట్లుగా నమోదయ్యాయి. 


అయితే ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం ఈ చిత్రం దాదాపు 23 కోట్లు కలెక్షన్ సాధిస్తేనే హిట్టుగా నిలుస్తుంది. మరి ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న టాక్ తో మిగతా 12 కోట్లు సాధించాల్సిన అవసరం చాలానే ఉంది. మరి ఆ కలెక్షన్ సాధించి రవితేజ చిత్రం హిట్ వైపుగా దూసుకుపోతుందేమో వేచి చూడాలి.


కాగా ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి దావ్జాండ్
సంగీతాన్ని అందించగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం


Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook