Eagle Collections: రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో వరస ఫ్లాపులు చవిచూసిన రవితేజ, తన ఆశలన్నీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈగల్ సినిమా పైనే పెట్టుకున్నాడు. సూర్య వర్సెస్ సూర్య సినిమా తరువాత చాలా గ్యాప్ ఇచ్చి కార్తీక్ తెర్కెక్కిచ్చిన చిత్రమిది. ఈ చిత్రంలో కొత్త రవితేజాన్ని చూస్తారని.. తను తన మేకోవర్ కోసం చాలా శ్రమించానని పలు ఇంటర్వ్యూలో రవితేజ చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తరువాత మాత్రం చిత్రంపై భిన్నభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుక్ మై షో లో రేటింగ్ బాగానే ఉన్నా ఈ చిత్రం పబ్లిక్ టాక్ అలానే రివ్యూలు మాత్రం ఎందుకో చాలా డల్ గా ఉన్నాయి. చూసినవారు కూడా సినిమా అనుకున్నంత రేంజ్ లో లేదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు ఎంత సాధించింది.. అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది.


ఈగిల్ సినిమాకు దాదాపు 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. దానికి తగినట్టుగానే ఈ సినిమాను అత్యధిక థీయేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో మొత్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చెయ్యగా ఓవర్సీస్‌లో 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. 



ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే తొలి రోజు ఈ చిత్రం ఓవర్సీస్‌లో.. అమెరికా, కెనడాలో 65K,ఆస్ట్రేలియాలో 8k, యూకే, ఐర్లాండ్‌లో 23k, యూఏఈ, గల్ఫ్‌లో 250 డాలర్లు వసూలు చేసింది. ఇక ఇండియాలో ఏపీ, నైజాంలో 4 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు ఆరు కోట్ల కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం ఈ చిత్రం దాదాపు 23 కోట్లు కలెక్షన్ సాధిస్తేనే హిట్టుగా నిలుస్తుంది. మరి ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న టాక్ తో మిగతా 16 కోట్లు సాధిస్తుందా లేదా అనేది అనుమానం.



ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి దావ్జాండ్
సంగీతాన్ని అందించగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం


Also ReadSamudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook