Ravanasura Leaked Clip: `కంచం ముందుకు.. మంచం మీదకు ఆడపిల్లలు రావాల్సిందే`.. లీక్ద్ వీడియోలో రవితేజ అరాచకం
Ravanasura Leaked Clip Viral: మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ మహారాజా రవితేజ రావణాసుర సినిమా నుంచి డైలాగ్ సీన్ లీక్ అయింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Raviteja Ravanasura Leaked Clip Got Viral in Social Media: సినిమాల మేకింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట నుంచి ఏదో ఒక విధమైన లీకేజ్ టెన్షన్, ఇప్పుడు టెన్షన్ పెడుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యూనిట్ కి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. అదేమిటంటే ఈ సినిమాలో అమ్మాయిల గురించి హీరో రవితేజ మాట్లాడిన ఒక డైలాగ్ సీన్ లీక్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
వెంటనే సినిమా యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రవితేజ ఒక క్రిమినల్ లాయర్ పాత్రలో నటిస్తున్నట్టుగా ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద క్లారిటీ లేదు, అయితే ట్రైలర్లో కొంత మేర సూచనలు కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన రవితేజ రావణాసుర 9 సెకండ్ల బిట్లో కంచం ముందుకి, మంచం మీదకి పిలవగానే ఆడపిల్లలు రావాలి, లేదంటే నాకు మండుద్ది రా అని గట్టిగా గద్దిస్తూ ఉండగా ఒక యువతి రవితేజ వైపు నడుస్తున్నట్టుగా ఈ సీన్ లీక్ అయింది.
అయితే అందులో ఉన్నది హీరోయిన్ ఆ లేక వేరే ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే విషయం మీద క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాని విలక్షణమైన సినిమాలు తెరకెక్కిస్తాడని పేరున్న సుధీర్ వర్మ డైరెక్టర్ చేయగా స్వయంగా రవితేజ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. అలాగే అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించారు.
Also Read: Devarakonda-Jr NTR: లైగర్ దెబ్బకు జడిసిన యష్ రాజ్ ఫిలింస్.. లేదంటే ఎన్టీఆర్ బదులు?
రామారావు ఆన్ డ్యూటీ సినిమా తర్వాత రవితేజ ఈ సినిమా సహనిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద రవితేజ చాలా నమ్మకం పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు రవితేజ ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకోవాలని కష్టమైనా, నష్టమైనా, లాభమైనా మనమే చూసుకుందాం అని అభిషేక్ నామాకి రవితేజ చెప్పడంతో ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమా నుంచి విడుదలకు కొద్ది గంటల ముందు నెగిటివిటీ పెంచే విధంగా ఉన్న ఒక చిన్న బిట్టు లీక్ అవడం సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే రవితేజ ఇలాంటి పాత్రలో కూడా నటించాడా అని ఆశ్చర్యం కలిగించే విధంగా సీన్ ఉండడంతో కావాలనే సినిమా యూనిట్ దీన్నేమైనా లీక్ చేశారా? అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది చూడాలి మరి నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది.
Also Read: Ravanasura Pre Release: రావణాసుర సినిమా ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా? హిట్ కొట్టాలంటే టార్గెట్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook