Jr NTR Replaced Vijay Devarakonda in War2: గత రెండు రోజుల నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలో భాగమయ్యాడా? లేదా? అనే విషయం మీద అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ బాలీవుడ్ మొత్తానికి తలలో నాలుకలా వ్యవహరించే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే విషయాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరిలో ఎనలేని ఆసక్తి నెలకొంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ఈ సినిమా నిర్మించబోతున్నాడని ఇదే సినిమాలో టైగర్ ష్రాఫ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తాడని చెబుతున్నారు. గతంలో టైగర్స్ ష్రాఫ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ సినిమా రిలీజ్ అయింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా విడుదలైన ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఇక ఇప్పుడు వీరికి అదనంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే వాస్తవానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కన్సిడర్ చేసే కంటే ముందే విజయ్ దేవరకొండను ఆ పాత్ర కోసం తీసుకోవాలని యష్ రాజ్ ఫిలిమ్స్ మేకర్స్ భావించారట. అయితే లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో ఆయనతో వెళ్లి రిస్క్ చేయడం ఎందుకని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బీభత్సమైన క్రేజ్ ఉందని భావించి సౌత్ లోనే మూడు రాష్ట్రాలను కవర్ చేయగల సత్తా ఆయనకు ఉందని ఫిక్స్ అయ్యి చివరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించారని దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
Also Read: Aishwarya Divorce: ఐష్-అభిషేక్ విడాకులు.. అనూహ్యంగా తెర మీదకు కొత్త చర్చ!
ఇక ఈ సినిమాకి గాను ఎన్టీఆర్ దాదాపు 75 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా టాలీవుడ్ హీరోలలో ఒక బాలీవుడ్ సినిమా కోసం ఇంతలా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా హీరోగా ఎన్టీఆర్ నిలవబోతున్నారు. ఇక మొత్తం మీద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా గురించి చర్చలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
కొరటాల శివ కథ విషయంలో కొన్ని లీకులు ఇవ్వడం, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం, దానికి తగ్గట్లుగానే రక్తంతో నిండిన ట్యాంకర్లు ఈ సినిమా సెట్స్ కు రావడంతో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారంటూ సోషల్ మీడియా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులైతే రాజమౌళి సెంటిమెంట్ దెబ్బతో ఈ సినిమా ఫ్లాప్ అవ్వకుండా సూపర్ హిట్ కావాలని, పాన్ ఇండియా రేసులో తమ హీరో మరింత ముందుకు వెళ్లాలని ఆశలు పెట్టేసుకుంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎలాంటి అంశాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులనే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించబోతున్నాడు అనేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook