Nani: హీరో అయ్యాక నాని ప్రవర్తన తీరులో మార్పు.. రజాకార్ దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్
Razakar: రజాకార్ సినిమా టీజర్ దగ్గరనుంచి ప్రేక్షకులలో మంచి ఆసక్తి తీసుకొచ్చింది. కాగా ఈ చిత్ర దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్లో ఎంతో పేరు సంపాదించుకున్న హీరో నాని గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
Nani: నాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో బయట ప్రవర్తన తీరు కూడా అంతే డీసెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే నానిని అభిమానించే ప్రేక్షకులు తెలుగులో ఎంతోమంది ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి హీరో గురించి రజాకార్ దర్శకుడు ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
రజాకార్ సినిమా టీజర్ విడుదల దగ్గర నుంచి ప్రేక్షకులలో మంచి ఆసక్తి నెలకొల్పింది. ఇక మార్చి 15న విడుదలైన ఈ చిత్రం కొంతమంది దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్న మరి కొంతమంది దగ్గర నుంచి మాత్రం వివాదాలకు దారితీస్తోంది. అయితే ఈ చిత్రం తీసిన తీరుకి ఈ సినిమా దర్శకుని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆయన మరెవరో కాదు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు యాటా సత్యనారాయణ.. ‘రజాకార్’ సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దగ్గర శిష్యుడిగా పని చేసిన ఈ డైరెక్టర్.. చాలా సూపర్ హిట్ సీరియల్స్‌ని రూపొందించారు. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన నితిన్ హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకి యాటా సత్యనారాయణ కో డైరెక్టర్ కాగా.. హీరో నాని.. యాటాకి అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు.
ఎన్నో సంవత్సరాలు తన దగ్గర అసిస్టెంట్ గా ఉన్న నాని హీరో అయిన తరువాత చాలా మారిపోయారని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు. అతనికి సీనియర్ అయిన యాటా సత్యనారాయణతో నాని హీరో అయ్యాక మాట్లాడటం మానేశారు. నాని ‘అష్టాచెమ్మా’ సినిమాతో హీరోగా లాంఛ్ అయినప్పుడు కూడా.. తనతో చిన్న మాట కూడా చెప్పలేదని.. పేపర్ లో చూసి తానే నానికి ఫోన్ చేస్తే మాట్లాడారని.. అయితే కొంచెం స్టార్ హీరో అయిన తరువాత నాని మాట్లాడటమే మానేశారని చెప్పి వాపోయారు యాటా.
‘నాని స్టార్ హీరో అయ్యారు.. అలానే నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు తీస్తున్నాడు. నాని అప్పట్లో బాపు గారి కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని గాడ్ ఫాదర్‌లా భావించేవారు.. అయితే హీరో అయిన తరువాత నాని ఆయనకి కూడా సినిమా ఛాన్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే నాని మైండ్‌లో ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే గాడ్ ఫాదర్ అనుకున్నవారికైనా సినిమా ఛాన్స్ తప్పకుండా ఇచ్చుంటాడు కదా. ఒకవేళ తనతో సినిమా చేస్తే.. గతంలో మాదిరిగా సార్ అనో.. లేదంటే యాటా గారూ అని పిలవాల్సి వస్తుందనో ఏమో కానీ.. ఫోన్ ఎత్తడం కూడా మానేశాడు.. హీరో కాక ముందు నాని ఉన్నారు.. హీరో అయిన తరువాత నాని ఎలా మారిపోయారో తన మాటల్లో వివరించి.. అప్పట్లో ఒక ఇంటర్వ్యూ ద్వారా హాట్ టాపిక్ అయ్యారు ‘రజకార్’ చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ.
Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook