RC18: రామ్ చరణ్ లైనప్ మాములుగా లేదుగా.. తాజాగా లైన్లోకి ప్రశాంత్ నీల్ మూవీ..
RC18- Ram Charan - Prashanth Neel: రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నడు లేనంత స్పీడప్లో ఉన్నాడు. వరుసగా ఒకదాని వెనకగా మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తున్నాడు. తాజాగా పుట్టినరోజు సందర్బంగా ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
RC18- Ram Charan - Prashanth Neel: ఈ రోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటికే తన బర్త్ డే సందర్బంగా RC16 స్టార్ట్ చేసారు. సుకుమార్‌తో RC 17 అనౌన్స్ చేశారు. అటు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన 'జరగండి' లిరికల్ పాటను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్.. శంకర్ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో
విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు అనౌన్స్ చేసారు. తాజాగా రామ్ చరణ్ తన 18వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రశాంత్ నీల్.. రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. దీంతో వీళ్ల కాంబినేషన్ ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను డీవివి దానయ్య నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో 'సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కంప్లీట్ చేయాలి. అటు ఎన్టీఆర్ మూవీ ఉండనే ఉంది. ఆ తర్వాత యశ్‌తో 'కేజీఎఫ్ 3' మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇంకోవైపు రామ్ చరణ్ కూడా శంకర్ మూవీ తర్వాత బుచ్చిబాబు సన.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. మొత్తంగా మూడు ప్రాజెక్ట్స్ కంప్లీటైన తర్వాత కానీ చరణ్ ఫ్రీ కాడు. అప్పటికీ ప్రశాంత్ నీల్ కూడా తన చేతిలో ఉన్న సినిమాలు చేసి ఫ్రీ అవుతాడు. మొత్తంగా చూసుకుంటే వీళ్లిద్దరు ప్రాజెక్ట్ 2025 ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మొత్తంగా రామ్ చరణ్‌తో ప్రశాంత్ నీల్ మూవీ అనగానే ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ పై ప్రశాంత్ నీల్ ప్రకటన చేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read: Love Guru Trailer: 'లవ్‌గురు'తో వస్తున్న బిచ్చగాడు హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే
Also Read: Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter