Kannada Movie Industry: కన్నడ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటివి తమ సినిమాలతో అతి పెద్ద బ్యానర్‌లుగా మారాయి. ఇప్పుడు వాటి సరసన ఆర్‌సీ స్టూడియోస్ కూడా నిలవబోతున్నది. ఇటీవల తీసిన మొదటి ప్రాజెక్ట్ ‘కబ్జా’ సినిమా కన్నడ చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్ అయింది. విజయోత్సవంలో ఉన్న ఆర్‌సి స్టూడియోస్ ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను తెరకెక్కించబోతోంది. ఆర్ చంద్రు కొత్త వెంచర్‌ను ప్రారంభించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్‌సి స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే బ్యానర్‌తో ఒకేరోజు 5 సినిమాలను ప్రారంభించడం ప్రప్రథమంగా జరగనుంది. ఈ చిత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మిస్టర్ ఆనంద్ పండిట్, ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ వంటి ప్రముఖులు క్లాప్‌ కొట్టి ప్రారంభించనున్నారు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర కూడా హాజరవుతున్నారు. ఈనెల 23న మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులో ఈ సినిమా ప్రారంభోత్సవాల కోసం అతిరథ మహారథులు తరలిరానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి.


కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల కోసం సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త సీకల్ రామచంద్ర గౌడతో కలిసి RC స్టూడియోస్ పని చేస్తోంది. ఈ ఐదు సినిమాలకు ఆర్‌సీ స్టూడియోస్‌ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాలను తెరకెక్కించనుంది. అయితే ఈ సినిమాలకు దర్శకులు, నటీనటులు, మిగతా బృందం వివరాలు త్వరలో ఆర్‌సీ స్టూడియోస్‌ ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. హోంబలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ మాదిరి తమ సినిమాలు కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలుస్తాయని ఆర్‌సీ స్టూడియోస్‌ యజమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాలు భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయో లేదో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు


Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook