Reason Behind KV Anudeep Not Wearing Slippers: పిట్టగోడ సినిమాతో పరిచయమైన కేవీ అనుదీప్ ఆ సినిమాతో ఏమాత్రం గుర్తింపు దక్కించుకోలేకపోయారు. అయితే జాతి రత్నాలు అనే సినిమా సబ్జెక్ట్ తీసుకొని నాగ అశ్విన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన తన మామ అశ్వినిదత్ వద్దకు ఈ కథ తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు జాతి రత్నాలు సినిమా ప్రారంభమైంది. నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించి అటు నిర్మాతకు ఇటు దర్శకుడికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కేవీ అనుదీప్ ఇటీవల ప్రిన్స్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ ఈ సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. ఆ సంగతి అలా ఉంచితే అనుదీప్ చాలా ఇంట్రావర్ట్ లాగా ఇంటర్వ్యూలలో కనిపిస్తాడు.


అనేక ఇంటర్వ్యూలలో ఆయన కనిపించాడు కానీ ఆయనను ఏ ప్రశ్న అడిగినా వింతగా సమాధానం చెబుతూ సమాధానం సరిగ్గా చెప్పకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే అనుదీప్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన సాధారణంగా చెప్పులు ధరించరు. ఎంత పెద్ద సినిమా ఫంక్షన్ అయినా చెప్పులు లేకుండానే ఆయన నడుస్తూ వచ్చేస్తారు,


ఇలా చెప్పులు లేకుండా నడవడానికి గల కారణం ఏమిటో అని ఒక ఇంటర్వ్యూలో ఆయనను ప్రశ్నిస్తే క్లీన్ట్ ఒబెర్ అనే ఒక రచయిత రాసిన పుస్తకాన్ని తాను చదివానని ఎర్తింగ్ అనే ఆ పుస్తకంలో ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ మనిషి జీవితంలో భాగమయ్యాక ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బాండింగ్ మిస్ అవుతుందని.  


ముఖ్యంగా భూమికి మనిషికి ఉన్న కనెక్టివిటీ తగ్గిపోతుందని భావించి అప్పటి నుంచి చెప్పులు వేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు. చెప్పులు వేసుకోకుండా నడిస్తే భూమితో నేరుగా అటాచ్మెంట్ ఉంటుందని అది మనకు కొంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని అనుదీప్ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు దీని వెనక ఎంత కథ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.


 Also Read: Deepika Pilli: అందాల ఆరబోతతో కిక్కెస్తున్న దీపికా పిల్లి.. గ్లామర్ డోస్ పెంచిన బుల్లితెర ముద్దుగుమ్మ


Also Read: Chandramohan: 1000 సినిమాలు చేసి అలా 100 కోట్లు నష్టపోయిన చంద్రమోహన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook