AR Rahman assistant divorce reason : సుమారుగా మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తిపలికారు రెహమాన్. ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రెహమాన్ సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు ఖతీజా, రహీమా.. కొడుకు అమీన్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇదిలా ఉండగా రెహమాన్ విడాకులు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన శిష్యురాలు మోహిని డే కూడా తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈయన విడాకులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్ ప్రూఫ్ లో బాస్ ప్లేయర్గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా విడాకులు తీసుకుంది. ఈమె సంగీత స్వరకర్త మార్క్ ను వివాహం చేసుకుంది. విడాకుల అనంతరం మోహిని తన ఇంస్టాగ్రామ్ లో ఇలా రాసుకుంది. మార్క్, నేను బాధాతప్త హృదయాలతో విడిపోతున్నాము. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము.ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో కామెంట్ చేసింది. ఇకపోతే గురువు విడిపోయిన కొన్ని గంటల్లోనే శిష్యురాలు కూడా సోషల్ మీడియా వేదికగా విడాకులు ప్రకటించడంతో.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


గురువు ప్రకటించిన కొంత సమయానికి శిష్యురాలు కూడా విడాకులు ప్రకటించింది. ఒకవైపు ఏ ఆర్ రెహమాన్ వేడాకులు.. ప్రకటించడానికి కంటే ఆరు నెలల ముందే ఆయన మేనల్లుడు ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా విడాకులు ప్రకటించారు. ఇలా ఏఆర్ రెహమాన్ కి సంబంధించిన పలువురు వ్యక్తులు విడాకులు ప్రకటించడంతో.. అసలు ఏం జరుగుతోంది అంటే నేటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ ఎప్పటినుంచో విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని.. అసలు ఏఆర్ రెహమాన్.. విడాకులకు ఈమె విడాకులకు.. సంబంధమే లేదని సమాచారం. న్యూస్ లో వస్తున్నవని కేవలం పుకార్లే అని.. ఏఆర్ రెహమాన్ టీం తెలియజేసినట్లు తెలుస్తోంది.


Read more: Tirumala: తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన.. ఏంజరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.