Kalki 2898 AD: ప్రస్తుతం మన దేశంలో ఏకైక ప్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తో దేశ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ప్రభాస్.. ఆ తర్వాత అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూగా  రచ్చ చేస్తూనే ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరిస్ సినిమాల తర్వాత ‘సాహో’తో నార్త్ లో సత్తా చూపెట్టాడు. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ తో ప్రభాస్ పని అయిపోయిందన్న వాళ్లకు ఆదిపురుష్, సలార్ మూవీలతో తనేంటో చెప్పకనే చెప్పాడు. తాజాగా ‘కల్కి 2898ఏడి’ మూవీ హిందీలో దాదాపు రూ. 300 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులుపుతూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 ది సీజ్ ఫైర్’ తో హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి మూవీతో బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 1100 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 555 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే  ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే ఈ సినిమా $6 మిలియన్స్ డాలర్స్ తో  మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా $18 మిలియన్ డాలర్స్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2 తర్వాత నార్త్ అమెరికాలో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా మరేది లేదు. అంతేకాదు ఈ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా కూడా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా రెండో భాగం రానుంది. ఈ చిత్రం వచ్చే యేడాది మేలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.


ఇక కల్కి మూవీ ప్రభాస్ కెరీర్ లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్.. యేడాది చివర్లో ‘కన్నప్ప’ మూవీతో పలకరించబోతున్నాడు. ఇందులో ఆయనది అతిథి  పాత్రలో కనిపించబోతున్నాడు. మరోవైపు ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ లైన్ లో ఉంది. మరోవైపు ప్రభాస్.. ‘సలార్ 2’ మూవీని ముందుగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. 


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook