Prabhas: మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. దర్శకుల సంఘానికి భారీ విరాళం..
Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలు ఒకవైపు.. ప్రభాస్ ఒక్కడు ఒకవైపు అని చెప్పాలి. ఎపుడు ఎవరికీ ఏ ఆపద కానీ.. అవసరం అయినపుడు నేనున్నాంటూ ముందుంటారు. తాజాగా రెబల్ స్టార్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా తెలుగు సినీ దర్శకుల సంఘానికి రూ. 35,00, 000 భారీ విరాళాన్ని అందజేసారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు జయంతి రోజైన మే 4న డైరెక్టర్స్ డే గా గత కొన్నేళ్లగా జరుపుకుంటున్నారు. ఈ సారి ఈ వేడుకలను భాగ్యనగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ దర్శకులు సంఘానికి ప్రభాస్ రూ. 35 లక్షల విరాళం అందజేసారు. ప్రభాస్.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' సినిమా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మే 13న తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలంతా ఎన్నికల మోడ్‌లో ఉంటారు కనుక ఈ సినిమా విడుదల ను వాయిదా వేసారు. మరోవైపు ఇది ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను పూర్తైయిన తర్వాత మంచి డేట్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
మరోవైపు ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్..తొలిసారి ఆత్మ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ మూవీ చేస్తున్నాడు. అటు సలార్ 2 షూటింగ్ చేస్తూనే .. సందీప్ రెడ్డి వంగా సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలు పూర్తైయిన తర్వాత బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి.
Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్ హెచ్చరిక
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter