‘బాహుబలి’, బాహుబలి 2 సినిమాలు తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. రాజమౌళి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కిన్ బాహుబలి జపాన్‌లో విడుదలై భారీ కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కసారిగా అక్కడ సెలబ్రిటీ అయిపోయారు. ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన నిర్మాతలు ‘సాహో’ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సాహో గతేడాది ఆగస్టు 30న భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలైంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో సాహోను నిర్మించగా దాదాపు రూ.450 కోట్ల వసూళ్లు రాబట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు జపాన్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో డబ్బింగ్ త్వరగా పూర్తి చేసిన మూవీ యూనిట్ సోమవారం సాహో సినిమాను జపాన్ థియేటర్లలో విడుదల చేశారు. సాహోకు ముందు ప్రభాస్ నటించిన బాహుబలి 2 జపాన్‌లో విడుదలైన వంద రోజులపాటు విజయవంతంగా ఆడటం విశేషం. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించింది. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, జాకీ ష్రాఫ్, మందీరా బేడీ, మురళీ శర్మ కీలకపాత్రల్లో నటించారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..