Record Break Trailer launch Event : మంచి సబ్జెక్ట్ దొరికతే చాలు నటీనటులతో సంబంధం లేకుండా మేకర్స్ ప్యాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం 'రికార్డ్ బ్రేక్‌'. చదలవాడ శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. తాజాగా  ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్లింప్స్‌ను మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్ లాంఛ్ చేసారు. అలాంగే టీజర్‌ను ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఇక ట్రైలర్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్న కుమార్ విడుదల చేసారు. ఈ వేడుకకు చిత్రానికి సంబంధించిన నటీనటులు ఇతర టెక్నిషియన్స్ అందరు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ సందర్భంగా దర్శకుడు అజయ్  మాట్లాడుతూ..


దర్శకుడిగా నన్ను ఇండస్ట్రికి పరిచయం చేసిన వ్యక్తి చదలవాడ శ్రీనివాస రావు. ఆయనే స్వయంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు తనతో చెప్పినట్టు ఎంతో ఎగ్జైంటింగ్‌గా ఫీలయ్యాను. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వస్తోన్న జానర్‌కు భిన్నంగా వస్తోన్న సినిమా ఇది. ఇద్దరు అనాథలు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ఎలా పేరు తీసుకొచ్చారనే కథనంతో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. థియేటర్‌లో సినిమా చూసిన ప్రేఓకులు ఎంతో భావోద్వేగానికి లోనైవుతారని చెప్పారు. ఖచ్చితంగా మంచి సినిమాగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


తెలుగు ఫిల్మ్  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..


చదలవాడ శ్రీనివాసరావు గారు గతంలో శోభన్ బాబుతో జీవిత ఖైదీ చేశారు. ఆ తర్వాత  మాతృదేవోభవ సినిమాను  హిందీలో తులసి టైటిల్‌తో మనిషా కొయిరాలతో చేశారు. అటు ఆర్.నారాయణ మూర్తితో 'ఏ ధర్తీ హమారీ' అనే హిందీ సినిమా చేశారు. కంటెంట్ పై నమ్మకంతో సినిమాలు తెరకెక్కించే అతికొద్ది మంది దర్శకుల్లో చదలవాడ ఒకరు అన్నారు. అంతేకాదు 'బిచ్చగాడు' వంటి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన వ్యక్తి.  ప్రొడ్యూసర్ గా ఆయన సినిమాలుకు పెద్ద హీరోలు కూడా చేయలేని పబ్లిసిటీ చేసి సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తుల్లో చదలవాడ ముందుంటారు. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ సినిమాతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను.  



నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. 


ఈ సినిమాను చదలవాడ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురి, బెంగాలి, ఒడియా భాషల్లో రిలీజ్ చేస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం అన్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాన్నారు.



దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..


స్వర్గీయ చలపతిరావు గారు నాకు ముందు నుంచి అండగా ఉన్నారు. నా కోసం నిలబడ్డారు. ఆయన డబ్బింగ్ చివరలో చెప్పారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూసి బయటకు వస్తూ ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోలేనన్నారు. ఈ సినిమా ఇంత చక్కగా రావడానికి నాలో సగభాగం అయిన నా దర్శకుడు అజయ్ కే దక్కుతుందన్నారు. మరోవైపు నాకు ఇండస్ట్రీ నుంచి సహకరించిన ప్రసన్నకుమార్‌కి, రామ సత్యనారాయణకి ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు సాంకేతిక నిపుణులకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానన్నారు.
చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ 4 థియేటర్స్ ఉండేవి. కష్టపడి పుల్లలమ్మి సంపాదించిన డబ్బుల్లో సగం నేను నా స్నేహితులతో కలిసి ఆయ సినిమాలకు ఖర్చే చేసేవాళ్లం.   వేటగాడు, అడవి రాముడు, దేవదాసు ఇలాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. నా తోటి చిన్న నిర్మాతలు బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది నా కోరిక. ఈ సినిమా చివరి 45 నిమిషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నారు.


Also read: AP Fibernet Scam: ఫైబర్‌నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఛార్జిషీటు దాఖలు చేసిన సీఐడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook