Rekha Boj Sensational Comments: రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో ఖురాన్ లో ఉన్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ నుపుర్ శర్మ ట్విట్టర్లో చేసిన కామెంట్లను సమర్థించాడు అంటూ రాజస్థాన్ ఉదయపూర్ కి చెందిన ఒక ట్రైలర్ ని ఒక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన మీద దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటివరకు హీరోల నుంచి గాని హీరోయిన్ల నుంచి గాని స్పందించిన వారు చాలా తక్కువే. తాజాగా హీరోయిన్ ప్రణీత ఈ విషయం మీద స్పందిస్తూ ఒక ఫోటో షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సాయి పల్లవి మీద ప్రకాష్ రాజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎటుపోయారండి మీ సెక్యులర్ మేధావులు అంతా? మీకు అసలు సిగ్గు అనిపించదా? ఇంత ఓపెన్ గా సెక్యూలరిజం ముసుగులో మోసం చేస్తూ బతకడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? మీరంతా ఏటో ఒక వైపు ఓపెన్ అవ్వండి లేదా తప్పు ఎటువైపు జరిగినా ఒకేలా స్పందించండి, అమ్మ సాయి పల్లవి, బాబు ప్రకాష్ మీరు ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? మీరు కేవలం ఒక వర్గం మీద విషం కక్కడానికి మాత్రమే మీ నోటిని ఉపయోగిస్తారా? సెక్యులరిజం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ హీరోయిన్ రేఖ భోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


విశాఖపట్నంకు చెందిన రేఖ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కాలేజీ రోజుల్లోనే అనేక షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టి కాలాయ తస్మై నమః, దామిని విల్లా వంటి సినిమాలు చేశారు. హీరోయిన్ గా ఐదు సినిమాలు పూర్తి చేసిన ఆమె పెద్ద బ్యానర్లు పెద్ద హీరోల సినిమాలో చెల్లెలి పాత్రలు వచ్చినా తాను హీరోయిన్ అని హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని హీరోయిన్ పాత్రల కోసమే ఎదురుచూస్తున్నారు. 'రంగీలా', 'దామిని విల్లా', రవిశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్‌ సినిమా, నిర్బంధం సినిమా ఫేం బండి సరోజ్‌ కుమార్‌ హీరోగా ఓ సినిమాలో రేఖ భోజ్ నటించింది. మరో మూడు సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయట.
Also Read: Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!


Also Read: Ramya Raghupathi: పవిత్ర వచ్చాకే మాకు గొడవలు.. మగాడివయితే అలా చేయమంటూ నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook