Premaku Jai :ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై  అనసూర్య  నిర్మించిన చిత్రం 'ప్రేమకు జై'. నూతన నటి నటులతో వస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో చోటు చేసుకున్న ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రీనివాస్ మల్లం  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ..దుబ్బాక భాస్కర్ ప్రతినాయకునిగా నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా ఈ చిత్రం పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా టీజర్ చేసిన అనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ....''యంగ్ టాలెంట్ అయినా అందరూ ఈ సినిమాలో చాలా బాగా చేశారు. నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్  చాలా బాగుంది. ఈ టీజర్ నాకు బాగా నచ్చింది. చిత్ర యూనిట్  శుభాకాంక్షలు'' అన్నారు.


కాగా ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు.. హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు... 


ఇక ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈమధ్య కొత్త హీరోలు స్టార్ హీరోలు అనే సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు కథ బాగుంటే ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కూడా అలానే తెరకెక్కి తెలుగు ప్రేక్షకుల దగ్గర జేజేలు అందుకుంటున్నమో తెలియాలి అంటే ఈ చిత్ర విడుదల వరకు వేచి చూడాలి.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook