Renu Desai Tweet: బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించి ఆ తరువాత జాని సినిమాలో కనిపించిన హీరోయిన్ రేణు దేశాయ్. హీరోయిన్ గా చేసింది రెండు సినిమాలే అయినా  ఆ రెండు సినిమాలలో తనదైన నటన చూపించి మంచి మార్కులు కొట్టేసింది ఈ నటి. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే అనుకోని కారణాలవల్ల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కొద్ది సంవత్సరాల క్రితమే విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ పిల్లలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న రేణు దేశాయ్ ఈమధ్య రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చినా కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా ఇంకెవరైనా సరే రేణు దేశాయి గురించి.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఏదో ఒక కామెంట్లు పెడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఇది చాలవు అన్నట్టు కొంతమంది యూట్యూబ్ లో అసలు ఏమి మాట్లాడతారో వారికే అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా అలాంటి కొన్ని ఇంటర్వ్యూల మీద రేణూ దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 


ఒక సీనియర్ పాత్రికేయులు తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన మాటలు, వీడియోలను షేర్ చేసి దానిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రేణు దేశాయ్. ఆ వీడియోలో ఒక పాత్రికేయుడు రేణు దేశాయ్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడదాం మనం చూడొచ్చు. ఇక దీని పైన తనదైన స్టైల్ లో స్పందించారు రేణు దేశాయ్. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ నేను దేశ.. పవన్ కళ్యాణ్ నామస్మరణ.. అకిరా నందన్‌ను తెరపైకి తీసుకురావడం తప్పా ఏం చేసినా జనాలు పట్టించుకోరన్నట్టుగా మాట్లాడాడు.


ఇక అదే విషయానికి సీరియస్ గా స్పందించారు రేణు దేశాయ్. దాని సొంతంగా సాధించిన విజయాలను గుర్తు చేశారు. మూడు సినిమాలు చేయడం, రైటర్, డైరెక్టర్, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం, క్యాస్టూమ్ డిజైనర్ ఇలా తాను ఎన్ని విజయాలు సాధించిందో అవన్నీ చెప్పుకొచ్చారు. తన పేరుని వాడుకుని, తన పేరును జపిస్తూ ఇలా వీడియోలు చేస్తూ, యూట్యూబ్‌లో మాట్లాడుతూ ఈ అంకుల్ డబ్బులు సంపాదించుకుంటున్నారు.. అంటూ ఆయనకి సరైన కౌంటర్ కూడా వేసేసింది.


 




ఈయన ఎవరో నాకు తెలీదు.. కానీ అంకుల్ మీ అనుభవం ఇదేనా? సినిమాల్లో ఆడవారి మీద చూపించే వివక్ష వలన, ఇలాంటి మగవాళ్లు ఇంకా కూడా అలాంటివే నమ్ముతూ.. ఆడవాళ్లు దేనికి పనికి రారు అనే భావనలో ఉంటున్నారు. మనం ఆ ఉద్దేశాన్ని చెరిపేయాలి.. మనం అటు దిశగా ఫోకస్ పెట్టాలి.. తండ్రి, భర్త, కొడుకులు ఇలా వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని, మన లాంటి ఆడవాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉండదని నమ్మే ఇలాంటి వాళ్ల మీద దృష్టి పెట్టాలి.. ఇది నా మీద మాట్లాడాడు కదా? అని నేను పెడుతున్న పోస్ట్ కాదు.. నేను ఇలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను.. ఈ వీడియోలు చూస్తుంటే.. పురుషాధిక్యత  అహంకారం ఎంత ఉందో కనిపిస్తోంది.. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి వారున్నారు.. ఇలాంటి వాటిపై చర్చలు జరగాలి.. స్త్రీ జాతి భవిష్యత్తు, గుర్తింపు కోసం చర్చలు జరగాలి..’ అని పోస్ట్ వేశారు.


అంతేకాదు ఈ పోస్ట్ అంతా అయ్యాక కింద రెండు లైన్లు కూడా రాశారు రేణు దేశాయ్. ‘ఇది నా మాజీ భర్త గురించి వేస్తున్న పోస్ట్ కాదు.. భవిష్యత్తు తరంలోని స్త్రీలు, కూతుళ్లు, మనవరాళ్ల గురించి పెడుతున్న పోస్ట్’ అంటూ ఫైనల్ లైన్ లో రేణూ దేశాయ్ క్లారిటీగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..


Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి