సినిమాలు, టీవీ షోలతో సంబంధం లేకుండా.. తరచుగా వార్తల్లో ఉండే అతి కొద్దిమంది సెలబ్రిటీలలో రేణు దేశాయ్ ( Renu Desai ) ఒకరు. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు, టీవీ షోలు ఏమీ లేకున్నా.. అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంటారు. అలాగే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆలోచింపచేస్తోంది. అదేమంటే.. రాబోయే రోజుల్లో వాహనాలు కొనేవారు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలకే ( Electric vehicles ) ప్రాధాన్యత ఇచ్చి... పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్ కార్లను పక్కకు పెట్టాల్సిందిగా రేణు దేశాయ్ సూచించారు. అప్పుడే మనం కాలుష్యానికి చెక్ పెట్టొచ్చని చెప్పిన రేణు దేశాయ్.. అందులో భాగంగానే తాను కూడా తన వద్ద ఉన్న Audi A6, Porsche boxter లగ్జరీ కార్లను అమ్మేసి విద్యుత్ తో నడిచే electric Hyundai Kona కారును కొనుగోలు చేశానంటూ తన కొత్త కారు ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రేణు దేశాయ్ ఆలోచన కూడా మంచిదే కదా అంటున్నారు ఆమె పోస్టు చూసిన నెటిజెన్స్. Also read : Tuck Jagadish: టక్ జగదీష్ మూవీలో నాని పాత్ర ఇదేనా ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేణు దేశాయ్ కెరీర్ విషయానికొస్తే.. పిల్లలు అఖీరా, ఆద్య చదువుల కోసం హైదరాబాద్‌లోనే ఉంటున్న ఆమె త్వరలోనే ఓ టీవీ షో ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. Also read: Ram Charan: రాంచరణ్‌కు ఈమధ్య బాగా నచ్చిన సినిమా