Tuck Jagadish: టక్ జగదీష్ మూవీలో నాని పాత్ర ఇదేనా ?

నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే పేరుంది. ప్రస్తుతం నాని నటించిన 25వ చిత్రం 'వి' విడుద‌లకు సిద్ధమవుతుండగా.. మరోవైపు  నాని 26వ చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్‌' ( Tuck Jagadish ) సెట్స్‌పై ఉంది.

Last Updated : Aug 10, 2020, 11:05 PM IST
Tuck Jagadish: టక్ జగదీష్ మూవీలో నాని పాత్ర ఇదేనా ?

నేచుర‌ల్ స్టార్ నాని ( Nani ) సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే పేరుంది. ప్రస్తుతం నాని నటించిన 25వ చిత్రం 'వి' విడుద‌లకు సిద్ధమవుతుండగా.. మరోవైపు  నాని 26వ చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్‌' ( Tuck Jagadish ) సెట్స్‌పై ఉంది. 'మ‌జ్ను' ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని.. జగదీష్ అనే ఓ డీసెంట్ యువకుడి పాత్ర పోషిస్తున్నాడనేది... ఆరుగురు తోబుట్టువులకు దిశా నిర్ధేశం చేసే పెద్దన్న పాత్రలో కనిపించనున్నాడనేదే ఇప్పటివరకు చాలామందికి తెలిసిన విషయం. ఐతే తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం బయటికొచ్చింది. అదేంటంటే.. టక్ జగదీష్ సినిమాలో నాని బై పోలార్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డే యువ‌కుడి పాత్రలో కనిపించనున్నాడట. బై పోలార్ డిజార్డర్‌ అంటే ఈ లక్షణాలతో ( Bipolar disorder ) బాధపడే వారికి భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉండటంతో పాటు క్షణంలో వారి మూడ్, ఎనర్జీ లెవెల్స్ మారిపోతుంటాయి. Also read : Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే

గతంలో భలే భలే మగాడివోయ్ సినిమాలో మైమరుపు ( Memory loss ) వ్యాధితో బాధపడే యువకుడి పాత్రలో జీవించిన నాని.. ఇప్పుడు బైపోలార్ డిజార్డర్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలని అతడి అభిమానులు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. Also read : COVID-19: ఏపీ లేటెస్ట్ కరోనా హెల్త్ బులెటిన్

Trending News