Renu desai serious on animal sacrifice: పవన్ కళ్యాన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. ఆమె పవన్ తో విడిపోయిన కూడా.. కొంత మంది మాత్రం.. మీరు తప్పుచేశారని, మా పవన్ అన్న.. మనస్సు అర్థం చేసుకొలేదని కూడా రేణుదేశాయ్ కు ఇన్ స్టాల్ కామెంట్లు పెడుతుంటారు. దీంతో పలుమార్లు రేణు దేశాయ్ దీనిపై సీరియస్ గానే రిప్లై సైతం ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. అనేక మందికి కూడా తన పెళ్లి విషయం, డైవర్సీ విషయాలకు దూరంగా ఉండాలని కూడా కౌంటర్ లు సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి  ఉంటున్నారు. ఈ నేపథ్యలో రేణు దేశాయ్ కు జంతువులు అంటే ఎంతో ఇష్టమని మనందరికి తెలిసిందే. అంతే కాకుండా.. ఆమె తరచుగా జంతువుల కోసం తన వంతుగా స్వచ్చంద సంస్థలకు ఏదో రకంగా సహాయం చేస్తు ఉంటారు.


నోరులేని జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటు ఉంటారు. అయితే.. ఇటీవల కొంత మంది నోరులేని జీవాల   పట్ల అత్యంత క్రూరంగా వ్యవహారించిన పలు వీడియోలను ఆమెను చూశారు. అంతేకాకుండా.. జంతుబలుల విషయంలో కూడా ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేవారు. దీంతో ఆవేశం పట్టలేక తన బాధను ఎక్స్ వేదికంగా పంచుకున్నట్లు తెలుస్తోంది.


పూర్తి వివరాలు..


రేణుదేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన..  ఒక యువకుడు కుక్కను పట్టుకుని నెలకేసి బాదిన వీడియోపై తీవ్ర  ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఇటీవల కాలంలో చాలా చోట్ల నోరులేనీ జీవాలను బలి ఇవ్వడంపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుక్కలను కొట్టిన వ్యక్తి అడ్రస్ తనకు ఇవ్వాలని,అతని పనిపడతానంటూ కూడా ఫైర్ అయ్యారు.


అంతే కాకుండా.. ఏదేవుడు కూడా జంతువులు బలిఇస్తేనే సంతోషిస్తాడని చెప్పలేదని మండిపడ్డారు. చాలా మంది దసరా నవరాత్రులలో మూఢనమ్మకాలతో జంతువులన బలిఇస్తుంటారు. ఏ దేవతైన, తల్లైన రక్తంను తీసుకుంటుందా.. మూడ జీవులను బలిస్తే  ఆ తల్లి శాంతిస్తుందని ఎక్కడుందని కూడా రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.  


Read more: Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..


దయచేసి మూగ జీవాలను ప్రేమతో దగ్గరకు తీసుకొండి..లేకపోతే..వాటిని మాత్రహా హనీ కల్గించకూడదని కూడా చెప్పుకొవచ్చింది..ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ జంతువులకు సంబంధించిన  ఎక్కడ ఏం జరిగిన కూడా.. తనదైనస్టైల్ లో రియాక్ట్ అవుతుంటారు. అంతేకాకుండా..పెటాకు కూడా తనవంతు సహాకారం అందిస్తుంటారు. జంతువులను చంపేవారికి నరకంలో కూడా జాగా ఉండదంటూ కూడా ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.