Dhanush, Aishwaryaa divorce : ధనుష్, ఐశ్వర్య విడాకులపై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్
Dhanush, Aishwaryaa divorce Ram Gopal Varma Tweets: ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్స్ చేశాడు. పెళ్లిపై తన అభిప్రాయం తెలిపాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
RGV about marriages and divorces after Dhanush, aishwarya divorce news announcement : తమిళ హీరో ధనుష్, (Dhanush) రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (Aishwaryaa) విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వారు వీడ్కోలు పలికారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా (Social media) ఖాతాల ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య, తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామంటూ ధనుష్ ట్వీట్ (Dhanush tweet) చేశాడు. తమ నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి.. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పర్సనల్ ప్రైవసీ అవసరం అని పేర్కొన్నాడు.
ఇక ఐశ్వర్య (Aishwaryaa) కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సేమ్ ఇదే విషయాన్ని చెప్పింది. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ఐశ్వర్య కోరింది. అయితే ఇప్పుడు ధనుష్, ఐశ్వర్యల విడాకులు (Dhanush Aishwaryaa divorce) టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట విడిపోవడంపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. కొందరు బాధపడుతూ పోస్ట్స్ షేర్ చేశారు. మరికొందరు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ పోస్ట్స్ పెట్టారు.
అయితే ఈ కోలీవుడ్‌లో (Kollywood) స్టార్ కపుల్స్ డైవర్స్ మ్యాటర్‌పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Director Ram Gopal Varma) స్పందించాడు. "సంతోషంగా ఉండటానికి రహస్యం ఏమిటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లకపోవడమే.. స్మార్ట్ పీపుల్ లవ్ చేస్తారు.. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు" ఇలా పలు రకాల ట్వీట్స్‌తో పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు వర్మ.
Also Read : Jai Bhim Oscar Youtube: ఆస్కార్ యూట్యూబ్ లో ప్రదర్శించిన తొలి తమిళ చిత్రంగా జై భీమ్ ఘనత
పెళ్లిళ్లతో కొని తెచ్చుకునే ప్రమాదాల గురించి యువతను హెచ్చరించేందుకు, స్టార్స్ తీసుకునే విడాకులు మంచి ట్రెండ్ సెట్టర్స్ అంటూ వర్మ (Varma) ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది మరొకటి లేదు. సంతోషానికి రహస్యం ఒక్కటే.. జైలుకు (Jail) వెళ్లడంలాంటి వివాహం చేసుకోవడం కంటే వీలైనంత కాలం ప్రేమిస్తూ ఉండడమే అంటూ వర్మ ట్వీట్ చేశారు.
వివాహంలో ఉండే ప్రేమ ఆ వేడుక జరిగే రోజుల కంటే తక్కువే ఉంటుంది అంటూ వర్మ (Varma) పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. అలాగే విడాకులను సంగీత్ కార్యక్రమంతో వేడుకలా చేసుకోవాలన్నాడు వర్మ.
Also Read : Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook