త్వరలోనే మరో జీఎస్టీతో మీ ముందుకు వస్తానంటున్నాడు ప్రముఖ ఫిలింమేకర్ రామ్ గోపాల్ వర్మ. అవును, వర్మ ఇటీవల డైరెక్ట్ చేసి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ నెటిజెన్స్ దృష్టిని తీవ్రంగా ఆకట్టుకుంది. వర్మ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిలింపై వచ్చిన వివాదాలు, పోలీసు కేసుల సంగతి ఎలా వున్నా.. అవే ఈ షార్ట్ ఫిలింకి కావాల్సినంత పాపులారిటీని సంపాదించి పెట్టాయి. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ప్రమోషన్స్ పుణ్యమా అని తన షార్ట్ ఫిలిం కూడా బాగానే హిట్ అయ్యిందని ప్రకటించుకున్న వర్మ.. త్వరలోనే జీఎస్టీ 2 తెరకెక్కించాలని అనుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను చేయబోయే ఈ ప్రయత్నంలో దేవుడు తనతోపాటు జీఎస్టీ లవర్స్‌కి తోడుగా వుంటాడని ఆశిస్తున్నానని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలావుంటే, తాను తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ట్రెండింగ్ లో దీపికా పదుకునే నటించిన పద్మావత్ ని దాటేసిందని మరో ట్వీట్ చేసిన వర్మ.. జీఎస్టీలో నటించిన మియా మల్కోవా శక్తి ముందు దీపికా పదుకునె ఓడిపోయిందని ఆ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.