RGV Intresting Tweet on Karthikeya 2: కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదలై విడుదలైన అన్ని భాషలలోనూ సూపర్ హిట్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్తికేయ 2 సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక సార్లు వాయిదా పడిన తర్వాత ఆగస్టు 13వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా కార్తికేయ సినిమా మీద వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో శుక్రవారం రోజున కార్తికేయ సినిమా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది ఒక రకంగా ఇది రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 సినిమాలు కంటే పెద్ద  బ్లాక్ బస్టర్ గా నిలిచింది, డైరెక్టర్ చందు మొండేటికి అభినందనలు అంటూ రాంగోపాల్ వర్మ రాసుకొచ్చారు. అయితే కార్తికేయ సినిమా హిట్ అయింది అని అందరూ ఒప్పుకుంటున్నారు కానీ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 సినిమాల కంటే పెద్ద హిట్ అయిందని ఎందుకన్నాడనే విషయం మీద చర్చ జరుగుతోంది.


దీనిపైన పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.  కావాలనే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ను రెచ్చగొట్టే విధంగా రాజమౌళి మాట్లాడాడని కొందరు అంటుంటే బడ్జెట్ పరంగా చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన కార్తికేయ 2 సినిమాతో భారీ బడ్జెట్ సినిమాలు అయిన  అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలను వెనక్కినెట్టిన ఈ సినిమాకు ఆ మాత్రం హైప్ క్రియేట్ చేయడంలో తప్పేమీ లేదని అంటున్నారు.


ఇక హిందీ ఆడియన్స్ కార్తికేయ 2 సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటిరోజు హిందీలో 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 3000 స్క్రీన్ లలో ప్రదర్శనమవుతోంది అంటే సినిమా మీద క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో వీకెండ్ కూడా సినిమాకి బాగా కలిసి రావడంతో ఎవరూ ఊహించని మేర కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Also Read: Roja Daughter Anshumalika as Heroine: ఆ హీరో సరసన హీరోయిన్ గా రోజా కుమార్తె


Also Read: Vijay Devarakonda on Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి