Vijay Devarakonda on Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?

Vijay Devarakonda Sensational Comments on Boycott Liger Trend: లైగర్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ జరుగుతున్న ట్రెండ్ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2022, 09:06 PM IST
Vijay Devarakonda on Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?

Vijay Devarakonda Sensational Comments on Boycott Liger Trend: విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. ఇప్పటికే దేశంలో అనేక నగరాలు చుట్టి వచ్చిన సినిమా యూనిట్ 20వ తేదీన గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. అంతకంటే ముందు విజయవాడలో సినిమా యూనిట్ సందడి చేసింది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మూడేళ్ల నుంచి లైగర్ సినిమా చేస్తున్నామని ఇంకా ఐదు రోజుల్లో సినిమా విడుదల కాబోతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఏపీ, తెలంగాణలో టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయని ప్రాణం పెట్టి చేసిన లైగర్ సినిమా అందరికీ నచ్చి తీరుతుంది అని చెప్పుకొచ్చారు. పూరి కథ చెప్పగానే మెంటల్ ఎక్కిందని వెంటనే ఓకే చెప్పేసానని నటిస్తున్నప్పుడు చాలా థ్రిల్ అనిపించిందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాను ఇండియా మొత్తానికి పరిచయం చేసింది కరణ్  జోహార్ అని విజయ్ పేర్కొన్నారు. మూడేళ్లు కష్టపడి పని చేశాను సినిమా తీసి ఇంట్లో కూర్చోవాలా, మనం ధర్మంతో ఉన్నాం ఏదొచ్చినా కొట్లాడుడే అంటూ బాయ్ కాట్ లైగర్ సినిమా కామెంట్స్ ను ఉద్దేశించి విజయ్ కామెంట్ చేశాడు.  కరోనా సమయంలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ కి సహకరించానని, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్లకు సేవ చేశారని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. తల్లి సెంటిమెంట్తో ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా? చూద్దాం, ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Director Puri Jagannadh Leaked Liger Movie Story:
ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ లైగర్ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ డ్రామా అని కరీంనగర్ కు చెందిన ఒక తల్లి తన కొడుకుని తీసుకుని ముంబై వెళుతుందని కష్టపడి బాక్సర్ ని చేస్తుందని మధ్యలో ప్రేమలో పడతాడని అదే లైగర్ స్టోరీ అంటూ లైగర్ కథ లీక్ చేసేశారు. చిన్న పెద్దా అందరూ కలిసి సినిమా చూడచ్చన్న పూరి అమ్మానాన్న తమిళ అమ్మాయికి, లైగర్ రెండూ ఒకటే అనే ప్రచారం జరుగుతుంది కానీ రెండు వేరువేరు స్టోరీలని చెప్పుకొచ్చారు. మన లైగర్ లాంటి సినిమాలు థియేటర్లలోనే చూడాలి ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదని చెప్పుకొచ్చారు.

Also Read: Top Pan India Heros List: టాప్ పాన్ ఇండియా హీరోల లిస్టులో ఐదుగురు తెలుగు హీరోలు!

Also Read: Sonam Kapoor Baby Boy: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News