ఎన్టీఆర్ జీవితచరిత్ర తెరపైకి వస్తుందో లేదో తెలియదు గానీ.. ఆర్జీవీకి మాత్రం ఈ సబ్జెక్టు ఒక ఆటలా తయారైంది. ఇటీవలే "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను తాను తీస్తు్న్నానని ఆర్జీవి ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ వార్త వచ్చిన కొన్నాళ్లకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా ఒక సినిమా తీస్తున్నట్లు తెలిపారు."లక్ష్మీస్ వీరగ్రంథం" అనే పేరు కూడా దానికి పెట్టినట్లు  తెలిపారు. ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒక మహిళ వెనక్కి తిరిగి నిలబడినట్లు ఆ పోస్టర్‌లో కనిపించడం గమనార్హం. ఆ పోస్టర్ మీద ఆర్జీవీ ఇటీవలే కామెంట్లు చేశారు."తానెవరో నాకు తెలియదు..కానీ వీపు మాత్రం బాగుంది" అని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. నాగహ్రుషి ఫిలింస్ పతాకంపై బి.విజయ్ కుమార్ గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ సినిమాకి "ఆదర్శ గృహిణి" అని సబ్ టైటిల్ కూడా పెట్టారు. మరి ఈ సినిమా ఏ కోణంలో తీస్తున్నారు? ఎలాంటి నిజాలు ఈ చిత్రం ద్వారా ఆయన వెల్లడించబోతున్నారన్నది మాత్రం ఇంకా తెలియదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING