Richest Hero: ఇండియాలో అత్యంత ఆస్తిపరుడు మన టాలీవుడ్ హీరోనే.. ఇంతకీ ఎవరంటే?
Rich hero in India: మనదేశంలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కో సినిమాకి కోట్లలో.. రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కో సినిమాకి భారీగానే సంపాదిస్తున్న స్టార్ హీరోలు ఇప్పటికే చాలా డబ్బులు వెనకేశారు. అయితే మన దేశం మొత్తం మీద ధనికుడు అయినా హీరో మన తెలుగు వాడే. ఇంతకీ ఆ హీరో ఎవరో మీకు తెలుసా?
Richest Hero in India 2024: ఈమధ్య కాలంలో స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాల బాటలోనే వెళుతున్నారు. ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ల పాటు డేట్లు ఇచ్చేస్తున్న స్టార్ హీరోలు.. అంతే భారీగా రెమ్యూనరేషన్లు కూడా అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకి వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు అన్నిటిలోనూ బడ్జెట్లో సగం మొత్తం హీరో రెమ్యూనరేషన్ కే అయిపోతోంది.
సినిమాకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ కూడా హీరోనే కాబట్టి.. హీరోల సంపాదన బాగానే ఉంటోంది. అయితే దేశవ్యాప్తంగా ధనికుడైన ఆయన హీరో ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేశవ్యాప్తంగా ఎక్కువ డబ్బులు ఉన్న హీరో మన తెలుగు హీరోనే. టాలీవుడ్ కి ప్యాన్ ఇండియా సినిమా అంటే ఏంటి అని రుచి చూపించిన హీరో కూడా అతనే.
ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆ హీరో మరెవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి సినిమాతో.. ప్యాన్ ఇండియా సినిమాలకి నాంది పలికారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో.. రికార్డులు సృష్టించిన ప్రభాస్ కారణంగానే ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
ఇక అసలు విషయానికి వస్తే మన దేశంలో హీరోల ఆస్తుల విలువలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కే జి ఎఫ్ స్టార్ యష్ కి 1578 కోట్ల ఆస్తి ఉంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ పేరు మీద 1842 కోట్లు ఉన్నాయట. బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ పేరు మీద 1866 కోట్లు ఉండగా.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి 1971 కోట్ల ఆస్తి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 1918 కోట్లు. లెజెండరీ నటుడు రజనీకాంత్ పేరు మీద 2680 కోట్ల ఆస్తులు ఉన్నాయట.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి 3508 కోట్లు, అమీర్ ఖాన్ కి 3980 కోట్లు, షారుక్ ఖాన్ పేరు మీద 4100 కోట్లు ఉన్నాయట. ఇక వీళ్లందరి కంటే ఎక్కువగా మన ప్రభాస్ దగ్గర ఏకంగా 5400 కోట్ల నికర ఆస్తి ఉందని అంచనా. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న ప్రభాస్.. తన పేరు మీద ఆస్తులు కూడా బాగానే వెనకేశారన్న మాట. ఇక ఒక్కో సినిమాకి ప్రభాస్ 100 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు అని ఆల్రెడీ తెలిసిన విషయమే.
Also Read: Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్బిఐ కొత్త గైడ్లెన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.